ఈ నెల 28నుంచి దసరా సెలవులు

Wed,September 18, 2019 12:33 AM

ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్17: రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైన బతుకమ్మ పండుగను ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది ముందస్తుగానే సెలవుల ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 28నుంచి విజయ దశమి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 28నుంచి అక్టోబర్ 13వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు వర్తించనున్నాయి. తిరిగి అక్టోబర్ 14న పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే విధంగా 28నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సెలవులు ఉంటాయని పేర్కొంది. అక్టోబర్ 10న కళాశాలలను పునః ప్రారంభించాలని ఆదేశించింది.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles