టీటీడీ పాలకమండలి సభ్యుడిగా బండి పార్థసారధి రెడ్డి

Wed,September 18, 2019 12:33 AM

సత్తుపల్లి,నమస్తే తెలంగాణ: ప్రపంచ ప్ర ఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ స భ్యుడిగా వేంసూరు మండ లం కందుకూరు గ్రా మానికి చెందిన పా రిశ్రామికవేత్త, హెటి రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారధిరెడ్డిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ పాలకవర్గ సభ్యులుగా ఏపీ ప్రభుత్వం తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ర్టాలకు చెందిన ప్రముఖులను నియమించింది. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడుగురిని టీటీడీ సభ్యులుగా నియమించగా చేయగా ఖమ్మం జిల్లాకు చెందిన బండి పార్థ్ధసారధిరెడ్డికి అవకాశం వచ్చింది.చిన్నతనం నుంచి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండటంతో పాటు పట్టుదల, కృ షితో ఉన్నతస్థానానికి ఎదిగారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్త త్వం కలిగిన పార్థసారధిరెడ్డిని టీటీడీ సభ్యనిగా నియ మించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంచెలంచెలుగా ఎదిగిన పార్థసారధిరెడ్డి...
మారుమూల గ్రామంలో జన్మించిన పార్థసారధిరెడ్డి అంచలంచెలగా ఉన్నత స్థానానికి ఎదిగారు. వేంసూరు మండలం కందుకూరులో బండి శ్రీనివాసరెడ్డి, సోమకాంతమ్మ దంపతులకు పార్థసారధిరెడ్డి జన్మించారు. పదో తరగతి వరకు కందుకూరులో చదివి అనంతరం సత్తుపల్లిలో డిగ్రీ పూర్తి చేశారు.హైద్రాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూనే హోటిరో డ్రగ్స్‌ను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి నేడు 10 వేలకు మందికి పైగా జీవనోపాధి కల్పిస్తున్నారు. స్వగ్రామమైన కందుకూరులో కల్యాణ మండపం, సాయిబాబా దేవాలయం నిర్మించారు. పరిసర ప్రాంత ప్రజలకు సేవలందిచాలనే తపనతో విద్యారంగం వైపు అడుగులు వేసి సత్తుపల్లి మండల పరిధిలోని గంగారంలో సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల, డీఏవీ పాఠశాలను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా కృషి చేశారు. సాయిస్ఫూర్తి ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్వహించే వివిధ ఆలయాలకు పెద్ద ఎత్తున్న విరాళాలు ఇస్తూ తన దాన గుణాన్ని చాటు కుంటున్నారు. పార్థసారధిరెడ్డికి భార్య కళావతి, కుమారుడు వంశీకృష్ణ,కోడలు అనితలు ఆయన వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నారు.

వరుసగా మూడో సారి సత్తుపల్లి వారికి అవకాశం..
సత్తుపల్లి నియోజకవర్గం ప్రతి విషయంలో ప్రత్యేకతను సంతరిం చుకుంటుంది. నాటి జలగం వెంగళరావు నుంచి నేటి పార్థసారధిరెడ్డి వరకు సత్తుపల్లికి ప్రత్యేకస్థానం లభిస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి ముఖ్య మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు, రాష్ట్ర మంత్రులు గా పనిచేసిన జలగం ప్రసాద్‌రావు, తుమ్మల నాగేశ్వరరావులు సత్తుపల్లికి గుర్తింపు తేగా సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యుడిగా వెంకటవీరయ్య రెండు పర్యాయాలు పనిచేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచిగెలుపొందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు రెండు సార్లు అవకాశం కల్పించగా వైఎస్ జగన్ ప్రభుత్వం పార్థసారధిరెడ్డిని టీటీడీ సభ్యునిగా నియమించింది.

136
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles