నియోజకవర్గాలకు ఈవీఎంలు

Sun,March 24, 2019 12:37 AM

ఖమ్మం, మార్చి 23 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి ఏప్రిల్ 11న జరగనున్న పోలింగ్‌కుగాను మొదటి విడత పరిశీలన చేసిన ఈవీఎంలను ర్యాండమైజేషన్ ద్వారా జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు కేటాయించినట్లు కలెక్టర్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో శనివారం పోలీసు కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్‌తో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి.. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 324 పోలింగ్ కేంద్రాలకు 384 బ్యాలెట్ యూనిట్లు, 384 కంట్రోల్ యూనిట్లు, 403 వీవీ ప్యాట్‌లను; పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 274 పోలింగ్ కేంద్రాలకు327 బ్యాలెట్ యూనిట్లు, 327 కంట్రోల్ యూనిట్లు, 343 వీవీ ప్యాట్‌లను; మధిర (ఎస్సీ) అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 255 పోలింగ్ కేంద్రాలకు 304 బ్యాలెట్ యూనిట్లు, 304 కంట్రోల్ యూనిట్లు, 319 వీవీ ప్యాట్‌లను; వైరా (ఎస్టీ) అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 232 పోలింగ్ కేంద్రాలకు 277 బ్యాలెట్ యూనిట్లు, 277 కంట్రోల్ యూనిట్లు, 290 వీవీ ప్యాట్‌లను; సత్తుపల్లి (ఎస్సీ) అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 280 పోలింగ్ కేంద్రాలకు 334 బ్యాలెట్ యూనిట్లు, 334 కంట్రోల్ యూనిట్లు, 350 వీవీ ప్యాట్‌లను కేటాయించినట్లు వివరించారు. ఈవీఎంలలో బ్యాలెట్, కంట్రోల్ యూనిట్‌లను 19 శాతం, వీవీ ప్యాట్‌లను 25 శాతం రిజర్వుగా కేటాయించినట్లు చెప్పారు. అసెంబ్లీ సెగ్మెంట్‌లకు కేటాయించిన ఈవీఎంలను రెండు రోజులలో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించనున్నట్లు చెప్పారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ చేపట్టిన అనంతరం ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో ర్యాండమైజేషన్ చేసి పోలింగ్ కేంద్రాలకు కేటాయించనున్నట్లు వివరించారు.

పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 (సోమవారం) నామినేషన్లు సమర్పించుటకు చివరి తేదీ అని, ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. సాయంత్రం 3 గంటలలోపు రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లో ఉన్నవారందరి నామినేషన్లనూ స్వీకరిస్తామని చెప్పారు. సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజకీయ పార్టీలు పూర్తిగా సహకరించాయని గుర్తుచేశారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికలలో కూడా సహకరించాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉందని, సరిహద్దులలో చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయని అన్నారు. డబ్బు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన 327 కేసులను నమోదు చేయడంతోపాటు 66 కేసులకు సంబంధించి శిక్షలను విధించినట్లు వివరించారు. ప్రార్థనా ప్రదేశాల్లో ఎన్నికల ప్రచారన్ని చేపట్టరాదని, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఇతరులను కించపర్చె విధంగా ప్రవర్తించరాదని సీపీ స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించవద్దని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. జిల్లాస్థాయి నోడల్ అధికారులు యూ.రాజు, కిరణ్, మదన్‌గోపాల్, సత్యనారాయణ, ఎన్నికల విభాగపు డిప్యూటీ తహశీల్దారు రాంబాబు, టీఆర్‌ఎస్ నుంచి ఎం.హన్మంతరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఏ.గోపాలరావు, బీజేపీ నుంచి జి..విద్యాసాగర్, సీపీఐ నుంచి తాటి వెంకటేశ్వరరావు, సీపీఎం ఆర్.ప్రకాష్, బీఎస్‌పీ నుంచి జె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల విధులు సమర్థంగా నిర్వహించాలి
వైరా, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్ 11న నిర్వహించనున్న పార్లమెంటు ఎన్నికలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కర్ణన్ సూచించారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వైరా నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లలో ఉపయోగించనున్న ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను భద్రపరిచే వైరాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని గోదామును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులతో పలు సూచనలు చేశారు. వైరా తహసీల్దార్ జె.సంజీవ, వైరా నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ పాల్గొన్నారు.

217
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles