బీజేపీ ఓటమి చారిత్రక అవసరం

Fri,March 22, 2019 11:40 PM

మయూరి సెంటర్, మార్చి 22: బీజేపీ ఓటమి చారిత్రక అవసరమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. శుక్రవారం పార్లమెంటు సీపీఎం అభ్యర్థి వెంకట్ నామినేషన్ సందర్భంగా జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన పెవిలియన్ గ్రౌండ్‌లో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఓటమి చారిత్రక అవసరమేనన్నారు. ఐదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదన్నారు. సభలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, పార్లమెంటు అభ్యర్థి వెంకట్, మాజీ ఎంపీ మిడియం బాబురావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాయిబాబు, రాములు, జూలకంటి రంగారెడ్డి, నరసింహారావు, సోమయ్య, సుబ్బారావు, ఐలయ్య, బుగ్గవీటి సరళ, హైమావతి, కార్పొరేటర్లు అప్రోజ్ సమీనా, ఎర్రా శైలజ తదితరులు పాల్గొన్నారు.

201
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles