కొత్తగూడెంలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

Fri,March 22, 2019 11:40 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో కీలకఘట్టమైన పోలింగ్ శుక్రవారం భధ్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని మొత్తం 11 జిల్లాల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంది. కొత్తగూడెం-భద్రాచలం డివిజన్ కేంద్రాల పరిధిలోని 23 మండలాల్లోని 23 పోలింగ్ కేంద్రాల్లో 87.56 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. జిల్లాలోని కొత్తగూడెం డివిజన్‌లో 15 మండలాల్లో 1322 మంది ఓటర్లు, భద్రాచలం డివిజన్‌లోని ఎనిమిది మండలాల్లో 721 మంది ఓటర్లు ఉన్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో మొత్తంగా నమోదైన 2043 మంది ఓటర్లలో 1789 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం డివిజన్‌లోని 15 మండలాల పరిధిలో మొత్తం 1322 మంది ఓటర్లలో 1145 మంది, భద్రాచలం డివిజన్‌లోని 721 మంది ఓటర్లలో 644 మంది తమ ఓటును వినియోగించుకున్నారు.

197
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles