దండాలమ్మా.. అంకమ్మ తల్లీ..

Fri,March 22, 2019 01:37 AM

రఘునాథపాలెం, మార్చి 21: ఖమ్మం నగరం ఇల్లెందు రోడ్డు కైకొండాయిగూడెం ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ, మహాలక్ష్మమ్మ, మద్దిరాజు రావమ్మల తిరునాళ్ల జాతర గురువారం అంగరంగ వైభవంగా మొదలైంది. ఐదు రోజుల పాటు పండుగలా జరిగే ఈ జాతరకు తొలి రోజున భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఖానాపురం, బల్లేపల్లి, పాండురంగాపురం, కైకొండాయిగూడెం ప్రాంతాలకు చెందిన భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకొని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంకమ్మ తల్లికి గాజులు, చీరెలు సమర్పించి చల్లంగా చూడు తల్లీ.. దీవించమ్మా.. అని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణం కోలాహలంగా మారింది. జాతర సందర్భంగా ఆలయం ప్రాంగణంలో వ్యాపారులు ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. భక్తులు సైతం ఆలయం వద్దనే బొనాలను వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు కొమ్ము భాస్కర్, గౌరవాధ్యక్షులు సుంకర రామలింగేశ్వర ప్రసాద్‌ల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శివాలయం కమిటీ అధ్యక్షుడు కొమ్ము సతీష్‌కుమార్, కార్యదర్శి సూరంశెట్టి నర్సయ్య, కోశాధికారి దారావత్ గవాస్కర్, హరి, కేలోత్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

236
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles