ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు

Thu,March 21, 2019 12:35 AM

దుమ్ముగూడెం, మార్చి 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరం పోలీసుస్టేషన్‌లో ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ వివరాలను స్థానిక ఎస్సై బొమ్మెర బాలకృష్ణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మండల పరిధిలోని చిన్ననల్లబల్లి, తాటివారిగూడెం గ్రామశివారులో బీటీ రోడ్డు వద్ద సాయంత్రం సమయంలో ముగ్గురు వ్యక్తులు పొదల్లో దాక్కుని ఉండటంతో పాటు అక్కడకు వచ్చిన ఆటోలో మరో నలుగురు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారని, అదే సమయంలో తమకు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడకు చేరుకుని వారిని చుట్టిముట్టినట్లు తెలిపారు. పారిపోతుండడంతో వారిని వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన సానుభూతిపరులు సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన వారికి పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. పాల్వంచ మండలం తోగ్గూడెం, బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామాల్లో సేకరించి వీటిని వారికి సరఫరా చేసేందుకు సిద్ధం చేసుకున్నారని తెలిపారు. దబ్బనూతలకు చెందిన సోంది రవి, కుర్సం మురళి, తెల్లం నాగరాజు, బూర్గంపాడు మండలం లక్ష్మీపురానికి చెందిన ఆటోడ్రైవర్ ఉడ్‌యార్డు, చింతూరు మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన మడకం చినబాబు, పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన సీహెచ్.దామన్, ములకలపల్లి మండలం ఆనందపురం గ్రామానికి చెందిన కోండ్రు జగదీష్‌లను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. చర్ల సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి వీరిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఇదిలాఉండగా మావోయిస్టు సానుభూతిపరుల నుంచి 30మీటర్ల సిల్క్ వైరు, డిటోనేటర్లు 10, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

205
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles