మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధం

Mon,March 18, 2019 11:44 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలునునసరించి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శించడం జరిగిందని, ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 20 వ తేదీలోగా సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో తెలియపర్చవలసినదిగా జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని ఓటరు జాబితా ప్రచురణకు సంబంధించి సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మండల ప్రజాపరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను పురస్కరించుకుని ఈ నెల 16న పార్టీల ప్రతినిధుల సమావేశం ఎంపీడీఓల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఓటరు జాబితాలో అభ్యంతరాలను ఈనెల 20లోగా ఎంపీడీఓలకు సమర్పించాలని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈనెల 23వ తేదీన అభ్యంతరాలను పరిష్కరించి 27న తుది జాబితా పబ్లికేషన్ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఖమ్మంజిల్లాలో 584 గ్రామ పంచాయతీలలో 5,338 వార్డులున్నాయని, 289ఎంపీటీసీలు, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయన్నారు. జిల్లాలో 7లక్షల 73వేల 345 మంది మొత్తం ఓటర్లలో 3లక్షల 80వేల 824మంది పురుషులు, 3లక్షల 80వేల 504మంది స్త్రీలు,17మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఓటరు జాబితాలో ప్రజల పేర్లతో పాటు, ప్రజాప్రతినిధులు, ఎన్నికలలో పోటీ చేయబోవు అభ్యర్థుల పేర్లను తప్పనిసరిగా సరిచూసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణాధికారి ప్రియాంక, జిల్లా పంచాయతీ అధికారి కే శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధి ఎం హన్మంతరెడ్డి, బిజేపీ పార్టీ నుంచి జి. విద్యాసాగర్‌రావు, సీపీఐ పార్టీ నుంచి తాటి వెంకటేశ్వరరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ గోపాల్‌రావు, తెలుగుదేశం పార్టీ నుంచి సింహాద్రియాదవ్, బీఎస్‌పీ నుంచి జే లక్ష్మణ్ పాల్గొన్నారు.

229
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles