ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదివస్ : సీపీ

Mon,March 18, 2019 11:44 PM

ఖమ్మం క్రైం, మార్చి 18 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ నిర్వహిస్తున్న ప్రజాదివాస్ కార్యక్రమం సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన పోలీస్ కమిషనర్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో ఆర్థిక లావాదేవీలు, భార్యభర్తల సమస్యలపై వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సీపీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదు : ఆర్థిక అవసరాల కోసం అప్పుగా తీసుకున్న లక్ష రూపాయలకు మూడుదఫాలుగా తీసుకున్న అప్పు చెల్లించినప్పటీకి ఖాళీ ప్రాంసరీ నోట్లు, చెక్కులను అడ్డుపెట్టుకుని నా బ్యాంక్ అకౌంట్ నుంచి 60వేల రూపాయలు డ్రా చేసుకున్నాడని అడిగినందుకు నాపై దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడని సత్తుపల్లి నుంచి వ్యక్తి ఫిర్యాదు .

ఫిర్యాదు : సమీప బంధువుల ఆర్థిక అవసరాల కోసం మా ఆస్తిని బ్యాంకులో తాకట్టు పెట్టి కోటీ యాబై లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చామని... ఇచ్చిన అప్పు చెల్లించమని అడిగితే ఇస్తాను అంటూ... కాలంవెల్లదిస్తూ ఇప్పడు కన్పించకుండా పోయిందని, అప్పు చెల్లించకపోవడంతో ఇల్లు జప్తు చేస్తామని బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయి. విచారణ జరిపి న్యాయంచేయాలని ఖమ్మం నుంచి క్రిష్ణయ్య ఫిర్యాదు.
ఫిర్యాదు : నా భర్త అనారోగ్యం, కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ఇంటి డాక్యుమెంట్ పెట్టి రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాను. ఇటీవల అప్పు తీర్చేందుకు అతని వద్దకు వెళ్లగా మా ఇంటి కాగితాలు మరోకరి దగ్గర తాకట్టు పెట్టి పదిహేను లక్షలు తీసుకున్నాడని అడిగితే ఆ డబ్బును నేను కట్టి ఇంటి కాగితాలు తీసుకెళ్లమని బెదిరింపులకు పాల్పడుతున్నారని విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఖమ్మంరూరల్ మండలం నుంచి మహిళ ఫిర్యాదు.

187
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles