ఉత్తమ్ వల్లే కాంగ్రెస్ ఆగం

Mon,March 18, 2019 01:53 AM

ఇల్లెందు, నమస్తే తెలంగాణ : కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలకు తీరని అన్యాయం చేసిందని టీపీసీసీ సభ్యుడు చీమల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఇల్లెందులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వలనే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందన్నారు. అడ్డగోలుగా టికెట్‌లు కేటాయించి ఓటమికి కారణమయ్యారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఉత్తమ్ అదే రీతిలో అనుసరిస్తున్నారని విమర్శించారు. ఓడిపోయిన బలరాంనాయక్‌కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఆదివాసీలకు ఒక్క స్థానం కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మహబూబాబాద్ టికెట్ బలరాంనాయక్‌కు కేటాయించడం దుర్మార్గమన్నారు. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి ఓడిపోయారన్నారు. వరుసగా రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తికి మళ్లీ పార్లమెంట్ టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు దూరమవుతున్నారని తెలిపారు. బలరాంనాయక్‌కు ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆలోచిస్తే బాగుంటుందన్నారు. లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన విధంగానే నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ బీసీ సెల్ నాయకులు నగేష్, దొబ్బ కృష్ణ, ఊకే లక్ష్మీనారాయణ, కల్తి అనిల్, చింతా రాంబాబు, ఏప పగడయ్య, తోలెం రాము, కాయం రమేష్, గొగ్గెల రమేష్, రామకృష్ణ పాల్గొన్నారు.

225
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles