దంపతుల హత్యకు కుట్ర ?

Thu,February 21, 2019 12:14 AM

చుంచుపల్లి, ఫిబ్రవరి 20 : మమ్మల్ని... గురువుగారు పంపించారు... ఈ తీర్థం మీరు తీసుకొండి మీ భర్తకు కూడా తెలుసు అంటూ... గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించి దంపతులు ప్రాణాల మీదకు తెచ్చుకు ఘటన బుధవారం జరిగింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు చుంచుపల్లి మండలం అంబేద్కర్‌నగర్ పంచాయతీలో దోమందుల సుధాకర్, భార్య ధనలక్ష్మీకి గత నాలుగు రోజులక్రితం గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై ఇంటివద్దకు వచ్చి మమ్మల్ని గురువు గారు పంపించారు. తీర్థం తీసుకొండి మీ భర్త కూడా తెలుసు అంటూ వెళ్లిపోయారు. ఇచ్చిన తీర్థాన్ని మూడు రోజుల తరువాత భద్రాచలం నుంచి తిరిగి వచ్చిన తరువాత బుధవారం ఉదయం స్నానంచేసి పూజచేసుకున్న అనంతరం భార్య ధనలక్ష్మీ తీర్థం తీసుకుంది. ఒక్కసారిగా ధనలక్ష్మీ కిందపడిపోయి నోటి నుంచి నురగులు కక్కుతూ కనిపించింది. దానిని గమనించిన సుధాకర్ చూసి ఎమైందంటూ తేరుకొని ఆ తీర్థం ఏమిటని నాలుకకు రాసుకున్నాడు. సుధాకర్‌కూడా కళ్లుతిరగడంతో ఇది ఏదో అయ్యేటట్లు ఉందంటూ బంధువులకు ఫోన్ చేశాడు. ఇంటిపక్కన ఉన్న వారి బంధువులు హడావుడిగా సుధాకర్ దంపతులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ధనలక్ష్మీ పరిస్థితి విషమంగా ఉందని, అదేవిధంగా సుధాకర్‌ను కూడా ఖమ్మం తీసుకెళ్లాల్సిందిగా డాక్టర్ సూచిండంతో మెరుగైన చికిత్సకోసం హైద్రాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఎమిటనే వివరాలు తెలియాల్సి ఉంది. డాక్టర్లు మాత్రం సైనైడ్‌లాంటి పదార్థం సేవిస్తేకాని ఇంత వేగంగా రియాక్ట్ అయ్యేపరిస్థి ఏర్పడదని చెపుతున్నారు. టూటౌన్ సీఐ చెన్నూరి శ్రీనివాస్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించి చుట్టుప్రక్కలవారిని ఈ ఘటనపై వాకబు చేశారు. ఈ ఘటనపై పూర్వాపరాలు పోలీసుల దర్యాప్తులో వెళ్లడి కావాల్సి ఉంది.

240
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles