జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Thu,February 21, 2019 12:13 AM

-పోలీస్ బందోబస్తు కట్టుదిట్టం చేయాలి..
-భక్తులకు సౌకర్యాలు కల్పించాలి : వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్

వైరా, నమస్తే తెలంగాణ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలో ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద నిర్వహించే జాతరకు అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని స్నానాల లక్ష్మీపురంలో ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణంలో జాతర ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణ కోసం బందోబస్త్‌ను కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు జాతర కోసం చేపట్టబోయే ఏర్పాట్ల ప్రణాళికకు స్థానిక గ్రామ ప్రజలు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. జాతరలో ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేవాలయం ముందుభాగంలో స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో ఉండే భక్తులకు టెంట్లు వేసి నీడ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అంతేకాకుండా ఫైర్ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిని, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. దొంగతనాలు నివారించేందుకు, చైన్ స్నాకింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేకంగా పోలీసులు బ్లూకోల్ట్, మొబైల్ టీమ్, మఫ్టీ పోలీసులను కేటాయించి నిరంతరం ఆ సిబ్బంది జాతరపై నిఘా ఉంచాలన్నారు. జాతర భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా వైరా నదిలో పుణ్య స్నానాలు ఆచరించే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం జాతరకు సంబంధించిన వాల్‌పోస్టర్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో వైరా ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, జడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ గౌరీశంకర్, వైరా సీఐ ఏ.రమాకాంత్, మధిర ఆర్‌టీసీ డీఎం సూర్యనారాయణ, ఎస్సై తాండ్ర నరేష్, మండల వైద్యాధికారిణి సుచరిత, వైరా ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ మాధవరావు, ఈవోఆర్‌డీ రమాదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ స్వామిదాస్, మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ కస్తాల నాగకోటేశ్వరరావు, సర్పంచ్ అమ్మిక రామారావు, ఎంపీటీసీ తడికమళ్ల నాగేశ్వరరావు, ఈవో వేణుగోపాల్, పలు గ్రామాల సర్పంచ్‌లు వేమిరెడ్డి విజయలక్ష్మి, శీలం రమాదేవి, రామారావు, ఏలీషా, ఎంపీటీసీ ముళ్లపాటి సీతారాములు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, పసుపులేటి మోహన్‌రావు, మండల అధ్యక్షుడు ఇరుపార్శపు భాస్కర్‌రావు, నాయకులు మిట్టపల్లి నాగి, దార్న రాజశేఖర్, షేక్ లాల్‌మహ్మద్, మోరంపూడి బాబురావు, వేమిరెడ్డి వెంకటకోటారెడ్డి, చింతనిప్పు రాంబాబు, ముత్తారపు డేవిడ్, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పొట్టపల్లి నాగేశ్వరరావు, పెరుగు నర్సింహారావు, బొమ్మిడాల శ్రీను, నర్వనేని బుజ్జి, షేక్ రహీం, మళ్ళా గోవిందరావు, కొండబాల అశోక్, శీలం చైతన్యరెడ్డి, రేచర్ల సత్యం, మచ్చా రామారావు, దార్ల శేఖర్, సామాల భాస్కర్‌రెడ్డి, బండారు తిరపతిరావు, అయినాల రాంబాబు, మేడిశెట్టి క్రిష్ణ, యనమద్ది శ్రీను, షేక్ సైదులు, రవి, బొడ్డు రామక్రిష్ణ, పమ్మి దాసు తదితరులు పాల్గొన్నారు.

239
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles