ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా వనం, మాటేటి

Thu,February 21, 2019 12:12 AM

మయూరిసెంటర్, ఫిబ్రవరి 20 : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఖమ్మం జిల్లాలకు చెందిన సీనియర్ పాత్రికేయులు వనం వెంకటేశ్వర్లు, మాటేటి వేణుగోపాల్ ఎన్నికయ్యారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడితో పాటు 50 మంది కౌన్సిల్ సభ్యుల ఎన్నిక జరుగగా ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నర్వేనేని వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి ఎస్‌కె ఖాదర్‌బాబా ఒక ప్రకటనలో తెలిపారు. వనం వెంకటేశ్వర్లు 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక పర్యాయం స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు. వీరి ఎన్నిక పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.

-పలువురి అభినందనలు
సీనియర్ పాత్రికేయులు వనం వెంకటేశ్వర్లు, మాటేటి వేణుగోపాల్‌లు స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికవడం పట్ల టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రాంనారాయణ, జిల్లా అధ్యక్షులు నర్వేనేని వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి ఖాదార్‌బుబు, రాష్ట్ర నాయకులు ఏనుగు వెంకటేశ్వర్‌రావు, నేషనల్ కౌన్సిల్ మెంబర్లు రవీంద్ర శేషు, పై మాధవరావు, ఎలక్ట్రానిక్ మీడియా సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కుర్రాకుల గోపి, నగర కన్వీనర్ మైస పాపారావు, ప్రెస్‌క్లబ్ కార్యదర్శి తాళ్లూరి మురళీ కృష్ణ, జిల్లా కోశాధికారి ఎన్ జనార్థనాచారి, జిల్లా నాయకులు ఆవుల శ్రీనివాస్, మామిడాల భూపాల్‌రావు, మైనోద్దిన్, కనకం సైదులు, దండా రామకృష్ణ, నాగేందర్‌రెడ్డి, ఉషోదయం శ్రీనివాస్ రావు, జనతా శివ, కెమెరా మెన్ అసోసియేషన్ కన్వీనర్ అలస్యం అప్పారావు తదితరులు అభినందనలు తెలిపారు.

280
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles