గోవింద నామస్మరణతో మార్మోగిన సింగాపురం..

Tue,February 19, 2019 01:32 AM

హుజూరాబాద్ రూరల్: సింగాపురం శ్రీ పద్మగోద సమేత వేంకటేశ్వర స్వామి అలయంలో జరుగుతున్న 22వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఆలయ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావు దంపతులు హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. రథంపై స్వామివారిని ఆసీనులుగావించి, కన్నులపండువగా ఊరేగింపు నిర్వహించారు. వేద పండితులు నాగిళ్ల షణ్ముకశర్మ, రాంభట్ట కార్తీక్‌శర్మ, అవధానుల దత్తాత్రేయశర్మ, పందిల్ల విజయేందర్‌శర్మ వేద పఠనం చేశారు. అలయ అర్చకులు రఘునాథ్, కిరణ్‌కుమార్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. వొడితల కుటుంబ సభ్యులు వొడితల కిషన్‌రావు, లలిత దంపతులు, డాక్టర్ పవన్‌కుమార్, డాక్టర్ సుశ్మిత దంపతులు, ప్రవీణ, వేముగంటి రవీందర్‌రావుతోపాటు భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
నేడు కల్యాణోత్సవం..
సింగాపురంలో నిర్వహిస్తున్న వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు అలయ చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. ఉదయం 11 గంటలకు స్వామి వారి కల్యాణం ప్రారంభమవుతుందనీ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కల్యాణోత్సవాన్ని తిలకించాలని ఆయన భక్తులను కోరారు.

217
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles