న్యాయవాద సొసైటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్యానెల్ ఘనవిజయం

Sun,February 17, 2019 02:30 AM

-ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం
ఖమ్మం లీగల్ : న్యాయవాద సొసైటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్యానెల్ మరోసారి ఘనవిజయం సాధించింది. కొత్తా వెంకటేశ్వరరావు రెండోసారి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం రాత్రి హైడ్రామాతో వాయిదా పడిన కార్యవర్గం ఎన్నిక శనివారం ఉదయం జరిగింది. టీఆర్‌ఎస్ ప్యానెల్ సభ్యులు, వారి మద్దతుదారులు ఎన్నికల అధికారుల ఎదుట హాజరై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కొత్తా వెంకటేశ్వరరావు ప్యానెల్‌లో కొండపల్లి జగన్మోహన్‌రావు, పాముల దానయ్య, పాలవెల్లి వెంకటేశ్వర్లు, అనంతుల కోటేశ్వరరావు, పఠాన్ అమీర్‌ఖాన్ ఉండగా వారికి ఇతర సభ్యులు మద్దతు పలికారు. దీంతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి గుడ్డేటి రమేష్ ప్రకటించారు. అధ్యక్షునిగా కొత్తా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షునిగా కొండపల్లి జగన్మోహన్‌రావు, జనరల్ సెక్రటరీగా అనంతుల కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా కోదాటి సరిత, కోశాధికారిగా పాముల దానయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపినవారిలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావు, యాచవరపు గోవర్ధన్‌రెడ్డి, కిలారు బాబ్జీ, పులిపాటి ప్రసాద్, మచ్చా నగేష్‌బాబు, తూము సుదర్శన్‌రావు, గొల్లపూడి రామారావు, గుడిపూడి తాజూద్దీన్‌బాబా, కర్లపూడి శ్రీనివాసరావు, మేకల నవీన్‌కుమార్, మామిడి హనుమంతరావు, బెల్లం ప్రతాప్‌రావు, మువ్వా నాగేశ్వరరావు, ఇమ్మడి లక్ష్మీనారాయణ, ఆకుల శేఖర్, ఆర్ నారాయణస్వామి, జీవీ లక్ష్మీనారాయణ, అజీజ్ పాషా ఉన్నారు.

250
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles