జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకెళ్లాలి..

Wed,February 13, 2019 12:44 AM

మయూరిసెంటర్ : విద్యార్థులు, క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి ఖమ్మం జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో 10 జిల్లాల క్రీడాకారులు యువతరంగం రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అజయ్‌కుమార్ హాజరై ప్రసంగించారు. నేటి యువత విద్యా, క్రీడారంగాలలో రాణించి, వారి తల్లిదండ్రులకు, చదువుకున్న కళాశాలలకు, జిల్లా, రాష్ట్ర ఖ్యాతి పాటు జాతీయస్థాయిలో క్రీడారంగంలో గుర్తింపును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ జిల్లాలకు చెందిన సూచిక బోర్డులతో గౌరవ వందనం చేయగా, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ స్వీకరించారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడుతూ ప్రతిభను చాటుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను విద్యా, క్రీడారంగాలను ప్రోత్సహించడంలో భాగంగానే యువతరంగం రాష్ట్ర క్రీడలను నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. తొలుత 800 మీటర్ల పరుగు పందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, చావా నారాయణరావు, నాయకులు జశ్వంత్, యువజన, క్రీడల జిల్లా అధికారి ఎం పరంథామరెడ్డి, ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, ఫిజికల్ డైరెక్టర్ బీ వెంకన్న, వీఎస్‌ఎస్ మూర్తి (కిడ్స్), అథ్లెటిక్ కోచ్ గౌస్ తదితరులున్నారు.

337
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles