టెన్త్ ఫలితాలపై దృష్టి సారించాలి

Wed,February 13, 2019 12:43 AM

మామిళ్లగూడెం, ఫిబ్రవరి 12: జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ వసతి గృహాలలో ఉండి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా షెడ్యూల్ ్డకులాల అభివృద్ధి సంక్షేమ అధికారి కే.సత్యనారాయణ సూచించారు. వసతిగృహ సంక్షేమాధికారుల సమీక్ష సమావేశం అంబేద్కర్ భవనంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున వసతి గృహ సంక్షేమాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుతున్న తీరును గమనించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాలో 21 వసతిగృహాలలో చదువుతన్న 566 మంది పదో తరగతి విద్యార్థుల చదువులపై వసతి గృహ సంక్షేమ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యేక తరగతుల బోధన ద్వారా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అలాగే అన్ని సంక్షేమ వసతి గృహాల్లో తప్పనిసరిగా మెనూ పాటించాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యడవల్లి ప్రభాకర్, ఖమ్మం ఏఎస్‌డబ్ల్యూవో శ్రీలత, వసతి గృహసంక్షేమాధికారులు పాల్గొన్నారు.

285
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles