జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం..!

Tue,January 22, 2019 01:32 AM

-సీతారామ ప్రాజెక్ట్ జిల్లాకు వరప్రదాయిని
-ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే నా ప్రథమ కర్తవ్యం
-ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా చూస్తా
-పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ ఆదరించండి
-ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్
ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా సమగ్రాభివృద్ధే నా లక్ష్యమని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అన్నారు. అసెంబ్లీలో రెండవసారి శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం తన స్వగృహంలో తొలిసారిగా ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాను అన్నిరంగాలలో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. జిల్లాను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక నిధులు ఇచ్చారన్నారు. ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని అందరూ అంటుంటారని, అటువంటి ఖమ్మం జిల్లాలో ఒక్క ఖమ్మం సీటు తప్పా మిగిలిన సీట్లలో టీఆర్ గెలవకపోవడం బాధాకరమన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలలో టీఆర్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్ట్ వరప్రదాయిని అని అన్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ ప్రభుత్వం సీతారామ లాంటి అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి జిల్లా ప్రతి ఎకరాకు నీరందించేందుకు కృతనిశ్ఛయంతో ఉందన్నారు. ఆంధ్ర పాలకులు దుమ్ముగూడెం టెయిల్ ద్వారా ఆంధ్రలో ఉన్న కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరందించారే తప్పా ఏనాడు ఖమ్మం రైతులను, తెలంగాణ రైతులను పట్టించుకోలేదన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్ర ప్రాంతానికి అక్రమంగా తరలించుకుపోతున్న నీళ్లు మనకు వస్తే తెలంగాణ రైతులు రెండో పంటకు ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.

40వేల క్యూసెక్కుల కృష్ణా జలాలను ఆంధ్రకు తీసుకుపోయి ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్న రిజర్వాయర్లను నింపుతున్నారన్నారు. వాళ్లు తరలించుకుపోయే నీళ్లు మనం శ్రీశైలం ద్వారా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 300 టీఎంసీల నీరు వచ్చినా కూడా ఖమ్మం జిల్లా రైతాంగానికి నీరువచ్చే పరిస్ధితిలేదన్నారు. ఆంధ్ర పాలకులు ఏవిధంగా జలదోపిడీ చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనమన్నారు. అప్పడున్న పాలకుల కాలంలో మన నాయకులు నిర్వీర్యులయ్యారన్నారు. కేవలం 12వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న పోతిరెడ్డిపాడు కెనాల్ 24వేల క్యూసెక్కులకు పెంచి ఒక నదిలాంటి కెనాల్ కట్టి అక్రమంగా 40వేల క్యూసెక్కుల తరలిస్తున్నారన్నారు. దీంతో మనం కృష్టాజలాలను కోల్పోవాల్సివచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి తెలంగాణ రైతులను బయటపడేసేందుకు సీఎం కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ సీతారామ లాంటి ప్రాజెక్ట్ రూపకల్పన చేసి నిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తుందన్నారు. రానున్న రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణలోని అన్ని ప్రాజెక్ట్ పాటు సీతారామ ప్రాజెక్ట్ పూర్తిచేసి ఖమ్మం జిల్లా రైతుల రుణం తీర్చుకుంటామన్నారు. టీఆర్ పార్టీని ఖమ్మం జిల్లా ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా టీఆర్ పార్టీని పటిష్టపరిచి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పార్లమెంటు స్థానం టీఆర్ పార్టీ గెలుచుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు.

రాబోయే రోజులలో ఖమ్మం ప్రజలు చైతన్యవంతులుగా ఆలోచించాలని ఖమ్మం శాసనసభ్యుడిగా కోరుతున్నానన్నారు. రఘునాథపాలెం మండలంలో గతంలో 17 గ్రామ పంచాయతీలు ఉండేవని, సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేయాలనే ఆలోచనతో 20 తండాలను నూతన పంచాయతీలుగా చేశారన్నారు. దీంతో రఘునాథపాలెం మండలంలో 37 పంచాయతీలు అయ్యాయని, ఈ37 పంచాయతీలను గెలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే అనేక గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, మిగిలిన గ్రామ పంచాయతీలను కూడా పార్టీలకు అతీతంగా ఏకగ్రీవం చేసుకుని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందించే నజరానాతో పాటు నా నిధులను కూడా కేటాయించి నూతన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తానన్నారు. నేను చేసిన గ్రామపంచాయతీలను అభివృద్ధి చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటానన్నారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఆయా పంచాయతీలను అభివృద్ధి చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. రెండవసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ఖమ్మం ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఖమ్మంను అభివృద్ధి పధంలో నడిపించేందుకు నాకృషి ఇంతకు ముందు కంటే పదింతలు పెరుగుతుందన్నారు. ఖమ్మంను మరింత అభివృద్ధి చేసేందుకు అనేక ప్రణాళికలను సిద్దం చేశామని, రాబోయే రోజులలో వాటన్నీంటిని అమలుచేసి ఖమ్మాన్ని ప్రగతిపధంలో ముందుంచుతామన్నారు.

373
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles