గణతంత్ర దిన వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి

Tue,January 22, 2019 01:30 AM

-కలెక్టర్ ఆర్ కర్ణన్
ఖమ్మం, నమస్తే తెలంగాణ : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లున్నింటిని సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26న భారత గణత్రంత దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు పరేడ్ మైదానంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లుపై సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకే సూచించిన విధంగా ఆయాశాఖల ప్రగతిని తెలిపే శకటాలను ఏర్పాటుచేయాలని అదేవిధంగా ప్రదర్శనకాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఉద్యానవన, వ్యవసాయశాఖల అధికారులు సమన్వయంతో ఆయాశాఖల శకటాలను సిద్ధం చేయాలన్నారు. పరిశ్రమలు, సంక్షేమ రంగాలు, విద్య, కో-ఆపరేటివ్, మార్కెటింగ్, ఇర్రిగేషన్, మత్స్యశాఖ, వైద్య ఆరోగ్యం, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక , సర్వశిక్ష అభియన్, డబుల్ బెడ్ మిషన్ భగిరథ, మిషన్ అటవీశాఖలతో పాటు ఇతర శాఖలు కూడా తమతమ శాఖలకు సంబంధించిన శకాటాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించుటకుగాను ఉద్యోగుల పేర్లను మంగళవారం సాయంత్రం నాటికి కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని అధికారులకు సూచించారు. జిల్లా ఇన్ రెవెన్యూ అధికారి మదన్ నగరపాలక సంస్థ కమిషనర్ జె శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ అధికారి ఇందుమతి, ఎస్సీ బీసీ మైనారిటీ, గిరిజన సంక్షేమశాఖల అధికారులు కె సత్యనారాయణ, హృషీకేష్ రమేష్, సైదా, ఆర్టీఓ శంకర్ డీఎస్ పరందామరెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

507
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles