లకారం చెరువుకు సాగర్ నీరు విడుదల

Sun,January 20, 2019 11:49 PM

కూసుమంచి,జనవరి 20: పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మంనగరంలోని లకారం చెరువుకు ఆదివారం 1000 క్యూసెక్యుల నీటిని ఎన్‌ఎస్‌పీ అధికారులు విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం నగర ప్రజలకు మంచినీటి అవసరాల కోసం ఈనీటిని విడుదల చేసినట్లు ఎన్‌ఎస్పీ డీఈఈ అక్బర్ బాషా తెలిపారు. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం 19.6 అడుగులు ఉండగా (1.975 టీఎంసీలు) నీటి మట్టం ఉంది. పాలేరు పాత కాలువకు ఆరుతడి పంటల కోసం 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆయన వివరించారు.

204
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles