నామినేషన్ల పరిశీలన పూర్తి..

Sun,January 20, 2019 01:49 AM

రఘునాథపాలెం, జనవరి 19 : రఘునాథపాలెం మండలంలో జరిగే మూడో విడత నామినేషన్లకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. 37పంచాయతీకు గానూ అధికారులు చేపట్టిన నామినేషన్ల స్వీకరణలో భాగంగా సర్పంచ్ స్థానాలకు 140, వార్డు స్థానాలకు 776నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే శనివారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో భాగంగా అందిన నామినేషన్లు అన్నీ సరైనవిగా ఎన్నికల అధికారులు తేల్చారు. నామినేషన్ల పరిశీలన అనంతరం సరైన అభ్యర్థులకు సంబంధించిన జాబితాను సాయంత్రం అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డులో ఉంచారు. జాబితాలో పొందుపరిచిన అభ్యర్థులపై అభ్యంతరాలు ఉంటే అధికారులు ఆదివారం స్వీకరించనున్నారు. ఈనెల 22వ తేదీ వరకు వేసిన నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అదేరోజున సాయంత్రం ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. కాగా టికెట్ ఆశించి భంగపడిన ఆశావాహులు ఇండిపెండెంట్ బరిలో నిలబడేందుకు పలు పంచాయతీల్లో ఒకేపార్టీ నుంచి రెండు మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఆయా పంచాయతీల్లో ప్రతిపక్ష పార్టీల పోటీ లేకపోవడంతో ఒకే పార్టీ నుంచి వేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేలా శనివారం పార్టీ నేతలు ఆశావాహులతో చర్చలు జరిపారు. పార్టీ నేతలు చర్చలు సఫలమైతే రఘునాథపాలెం మండలంలో పది పైచిలుకు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా టీఆర్ పార్టీకి చెందిన మండల నేతలు శనివారం రేగులచలక, పాపటపల్లి పంచాయతీల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్ధులను, పెద్దలను కలిసి సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ పిఏ కిరణ్, మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ, నాయకులు వడ్డే ప్రసాద్, మాదంశెట్టి హరిప్రసాద్, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, చెరుకూరి బిక్షమయ్య, యండపల్లి సత్యం, బోయినపల్లి క్ష్మణ్ ఉయ్యూరు వెంకటనారాయణ, చెన్నబోయిన సైదులు తదితరులు పాల్గొన్నారు.

306
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles