ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామానికి గుర్తింపు తెస్తా..

Sat,January 19, 2019 12:27 AM

ముదిగొండ: గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావటానికి తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వనంవారికృష్ణాపురం సర్పంచ్ అభ్యర్థి దమ్మాలపాటి మార్క్స్ ఓటర్లను కోరారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి 16 శాఖల అధికారులు ఉంటారని ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ విధానం ప్రకారం ప్రతీ 60 రోజులకు ఒకసారి ఈ శాఖల అధికారులందరితో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ సమస్యలు పరిష్కారం చేస్తానన్నారు. ప్రస్తుతం గ్రామంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ ఇళ్లు పూర్తవగానే నిబంధనల ప్రకారం అర్హులైన నిరుపేదలకు పంచి ఇంకా అర్హులైన వారందరికీ నిర్మించటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ పదవి అంటే ప్రజాసేవ చేయటానికే తప్ప స్వార్థ్దానికి కాదు! అని నిరూపించి గ్రామానికి ప్రథమ పౌరుడిగానే కాదు .. పెద్ద పాలేరుగా కూడా పనిచేస్తానంటున్నాడు దమ్మాలపాటి మార్క్స్. ఆయన చదివింది బీటెక్.. చేసేది విదేశాల్లో ఉద్యోగం.. కావాల్సినంత వేతనం అయినా.. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలకు సర్పంచే కీలకమైన వ్యక్తి అని, గ్రామాభివృద్ధికి సర్పంచ్ ఉంటేనే అభివృద్ధి చేయటానికి సాధ్యమవుతుందని ఆశించి వనంవారికృష్ణాపురం గ్రామానికి సర్పంచ్ పోటీ చేస్తున్నానని ఆయన వివరించారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించే దిశగా రూపొందించిన మ్యానిఫెస్టో ప్రజాదరణ పొందిందని ఆయన పేర్కొన్నారు.
మార్క్స్ ప్రచారానికి గ్రామంలో మంచి స్పందన..
మార్క్స్ ప్రచారానికి గ్రామంలో మంచి స్పందన వచ్చింది. గ్రామ ప్రజలు మార్క్స్ తీసుకున్న నిర్ణయం మంచిదని కీర్తిస్తున్నారు. యువత ఆయనతో నడుస్తున్నారు. మహిళలు ఆశీర్వదిస్తున్నారు. రైతులు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అతని ఆశయాన్ని స్వాగతిస్తున్నారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధికి సర్పంచ్ ఇటువంటి వ్యక్తే కావాలని కోరుకుంటున్నారు.

353
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles