జీపీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలి..

Sat,January 19, 2019 12:27 AM

ఖమ్మం, నమస్తేతెలంగాణ: శాసనసభ ఎన్నికల నిర్వహణ స్ఫూర్తితో జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రిటర్నింగ్ అధికారులు, మండల స్థాయి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మూడు విడతలుగా జరుగనున్న జీపీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 21వ తేదీన మొదటి విడత, 25న రెండవ విడత, 30న మూడవ విడత ఎన్నికల నిర్వహణకు అధికారులు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా చేసుకుని ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందుగానే బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహించే కేంద్రాలను అధికారులు ముందగానే సందర్శించి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుచ్ఛక్తి సరఫరా ఏర్పాటు చేసుకోవడంతో పాటు జనరేటర్ కూడా అందుబాటులో ఉంచాలన్నారు. బ్యారీకేడింగ్ ఏర్పాటు చేయటం, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నిషేదాజ్ఞాలను పట్టిష్టంగా అమలు చేసేవిధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలో కేవలం పోలింగ్ ఏజెంటును మాత్రమే అనుమతించాలని, రిటర్నింగ్ అధికారి-2 కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు జారీ చేయాలని సూచించారు. పోలింగ్ ఒక రోజు ముందుగానే ఆయా రిసెప్షన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రితో పాటు పోలింగ్ సిబ్బంది తమతమ పోలింగ్ కేంద్రాలకు చేరుకునే విధంగా రిటర్నింగ్ అధికారులు తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రెండవ, మూడవ విడత ఎన్నికలు జరుగనున్న గ్రామాల్లో కూడా ఎన్నికల ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పంచాయితీ అధికారి కే శ్రీనివాసరెడ్డి, జిల్లా స్థాయి నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్టేషన్ హౌస్, ఆఫీసర్లు తదితరులు వీడియో కాన్పరెన్స్ పాల్గొన్నారు.

294
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles