తుది విడుతకు నామినేషన్ల జోరు

Thu,January 17, 2019 11:57 PM

- రెండో రోజు 192 సర్పంచ్ పదవులకు 338 నామినేషన్లు
- 1740 వార్డు సభ్యుల పదవులకు 1296..
- ఏడు మండలాల్లో తుది విడుత నామినేషన్లకు నేడు చివరి రోజు
- ఏక గ్రీవం వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు

మామిళ్లగూడెం, జనవరి 17 : ఖమ్మంజిల్లాలో మూడోవిడుత ఎన్నికల్లో భాగంగా రెండోరోజు గ్రామ పంచాయతీలలో నామినేషన్ల కార్యక్రమం జోరుగా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో మూడోవిడుత జరగనున్న ఎన్నికల సమరానికి నాయకులు నామినేషన్లు దఖాలు చేసేందుకు ఉత్సాహం చూపించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తుది విడతలో 7 మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో 192 సర్పంచ్, 1740 వార్డుసభ్యుల పదవుల పాలక వర్గాల ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లాలో అధిక పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రజలను చైతన్యంచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో మొదటి విడుతలో 21 గ్రామపంచాయతీలు ఏకగ్రీవంకాగా రెండవ విడుతలోను 34పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

మూడవ విడుతలోను అత్యధిక గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు మండల స్థాయిలో సమన్వయ కమిటీలు వేసి గ్రామాలలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అందరి ఆమోదంతో సరైన అభ్యర్థిని ఎన్నుకుని నామినేషన్లు వేయిస్తున్నారు. ప్రజలందరి మద్దతుతో పంచాయతీలను ఏకగ్రీవం చేయించేందుకు కృషిచేస్తున్నారు. ప్రజల ఐక్యతతో గ్రామాలలో ప్రగతిశీల అభివృద్ధికి బాటలు వేసేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రజలల్లో చైతన్యం నింపుతున్నారు. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు పెద్ద ఎత్తున అభివృద్ధి నిధుల నజరానా ప్రకటించిన నేపధ్యంలో ప్రజలు ఆ దిశగా మొగ్గు చూపుతున్నారు. నేటితో జిల్లావ్యాప్తంగా తుది విడుత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దఖాలుకు సమయం ముగియనుంది.

రెండోరోజు నామినేషన్లు ఇలా...
జిల్లావ్యాప్తంగా మూడో విడుతలో జరగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో రెండోరోజు నామినేషన్ల కార్యక్రమం జోరుగా సాగింది. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీచేస్తున్న అభ్యర్థులు ఉత్సాహంగా తమ మద్దతుదారులతో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

374
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles