మణుగూరు ఏరియాలో.. బొగ్గు రవాణాకు పకడ్బందీ చర్యలు

Thu,January 17, 2019 11:54 PM

మణుగూరు, నమస్తేతెలంగాణ, జనవరి17: మణుగూరు ప్రాంతంలో సింగరేణి బొగ్గు రవాణాకు అవసరమైన పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు రైల్వే కోల్‌మూమెంట్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఆల్విన్ పేర్కొన్నారు. గురువారం ఆయన సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాలో పర్యటించారు. ఆయన తొలుత మణుగూరులోని రైల్వేకోల్‌యార్డును సందర్శించి బొగ్గు రవాణాను పరిశీలించారు. రోజుకు ఎన్ని వ్యాగెన్‌లలో బొగ్గును లోడ్ చేస్తున్నారు, వ్యాగెన్‌లో ఒక ట్రిప్పుకు ఎంత బొగ్గు రవాణా చేస్తారనే వివరాలను ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీహెచ్‌పీలో జరిగే లోడింగ్ సిస్టమ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో మణుగూరు ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావు, ఏరియా ఆఫీసర్ మణికుమార్ (సౌత్ సెంట్రల్ రైల్వే భద్రాద్రి), మార్కెటింగ్ జీఎం ఆంటోని రాజు, ఏరియా ఎస్వోటూ జీఎం రమేష్‌రావు, డీజీఎం (సివిల్) వెంకటేశ్వర్లు, క్వాలిటీ మేనేజర్ శ్రీనివాస్, కృష్ణమూర్తి, బోగ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

రైల్వే లైన్ స్థలాన్ని పరిశీలించిన సబ్‌కలెక్టర్
అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు, పినపాక మండలాల్లో నిర్మిస్తున్న 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ (బీటీపీఎస్)కు సంబంధించి సుమారు 175 ఎకరాల్లో 17 కిలోమీటర్ల వరకు రైల్వేలైన్ నిర్మించేందుకు సర్వే నిర్వహించారు. ఈ స్థలాలను సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రా గురువారం సందర్శించారు. రామానుజవరం గ్రామంలో రైల్వేలైన్‌కు సంబంధించిన స్థలాన్ని, రైల్వేలైన్ మ్యాప్‌ను పరిశీలించారు. అక్కడే గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే లైన్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు సర్వే చర్యలను సమగ్రంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మణుగూరు తహసీల్దార్ తిరుమల ప్రకాష్‌రావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

450
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles