జిల్లాలోమూడో విడత నామినేషన్ల జోరు..

Thu,January 17, 2019 01:42 AM

మామిళ్లగూడెం: ఖమ్మం జిల్లాలో మూడవ విడత ఎన్నికల్లో భాగంగా తొలిరోజు గ్రామపంచాయతీలలో నామినేషన్ల ప్రక్రియ మందకోడిగా కొనసాగింది. కనుమపండుగ కావడంలో అభ్యర్థులు తక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలో మూడవ విడత జరగనున్న ఎన్నికల సమరానికి నాయకులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తుది విడతలో 7 మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో 192 సర్పంచ్, 1740 వార్డు సభ్యుల పదవుల పాలక వర్గాల ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమైయ్యాయి. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లాలో అధిక పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రజలను ఐక్యం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే జిల్లాలో మొదటి విడతలో 21 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా, రెండవ విడతలోనూ మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. మూడవ విడతలోనూ అత్యధిక పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు మండల స్థాయిలో సమన్వయ కమిటీలు వేసి గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అందరి ఆమోదంతో సరైన అభ్యర్థిని ఎన్నుకుని నామినేషన్లు వేయిస్తున్నారు. ప్రజలందరి మద్దతుతో పంచాయతీలను ఏకగ్రీవం చేయించేందుకు కృషి చేస్తున్నారు. ప్రజల ఐక్యతతో గ్రామాల్లో ప్రగతిశీల అభివృద్ధికి బాటలు వేసేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రజలల్లో చైతన్యం నింపుతున్నారు. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధుల నజరానా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

తొలి రోజు నామినేషన్లు ఇలా..
జిల్లావ్యాప్తంగా మూడో విడతలో జరగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి రోజు నామినేషన్ల మందకోడిగా సాగింది. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉత్సాహాంగా తమ మద్దతుదారులతో నామినేషన్ పత్రాలు దఖాలు చేశారు. తొలిరోజు జిల్లాలో 7 మండలాల్లో నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

436
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles