టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే.. పండుగలకు ప్రాధాన్యం

Tue,January 15, 2019 04:54 AM

మయూరిసెంటర్: పండుగలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం సంక్రాంతి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగర నడిబొడ్డున గల లకారం ట్యాంక్‌బండ్‌పై సంక్రాంతి సంబురాల నిర్వహణ మాటల్లో చెప్పలేనిదని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తూ ఆ దిశగా చర్యలు చేపట్టి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు.. అన్ని మతాల పండుగలను ప్రోత్సహిస్తూ నిరుపేదలందరికీ ప్రభుత్వం అవసరమైన వస్తువులు అందించి, ఆదుకుంటూ వస్తుందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా లకారం ట్యాంక్‌బండ్‌పై ప్రతీ ఒక్కరు ఆహ్లాదభరిత వాతావరణంలో ఉత్సాహంగా సంక్రాంతి సంబురాలను జరుపుకోవడం ఖమ్మం జిల్లాకే గర్వకారణమన్నారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు ఈ పండుగ నిలయమన్నారు. లకారం ట్యాంక్‌బండ్‌ను మరో 7 ఎకారాల్లో విస్తరింపజేసి, పార్కు, పిల్లల గేమ్స్‌కు చెందిన ఆటవస్తువులను అందించి అభివృద్ధికి తోడ్పడతానన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా సంక్రాంతి సంబురాలలో భాగంగా కైట్, ఫుడ్ ఫెస్టివల్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులను ఆయన అభినందించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా ఖమ్మం నగరంలోని లకారం పార్కును ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పార్కును ప్రతీఒక్కరు పరిశుభ్రంగా ఉండేలా తోడ్పాటును అందించాలని సూచించారు.

లకారం చుట్టూ పరిసరాలను ఔషధ, పూల మొక్కలను పెంచే విధంగా అధికారులు దీనిపై ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ముందుగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మేయర్ డాక్టర్ పాపాలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్జేసీ కృష్ణ, కమర్తపు మురళీలు లకారం ట్యాంకుపై ప్రత్యేక ఆకర్షణతో తయారు చేసిన పతంగులను ఎగురవేశారు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఖిల్లా వద్ద రాక్‌క్లెయిబింగ్‌లో, 200 మంది యువత ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ ఇవెంట్ రాక్‌క్లెయింబింగ్ అడ్వంచర్ తెలంగాణ రాష్ర్టానికి చెందిన హరిచరణ్‌సింగ్, రఘులు ఈ ఈవెంట్ నిర్వహించగా, తెలంగాణ రాష్ట్ర కోహినూర్ కైట్ క్లబ్ అధ్యర్యంలో పతంగుల పండుగ నిర్వహించారు. సాయంత్రం లకారం ట్యాంక్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫుడ్‌స్టాల్స్‌లను ఆయన పర్యవేక్షించి, ఆహారపదార్థాలను రుచి చూశారు. ఈ కార్యక్రమ అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలను జిల్లా పర్యాటక శాఖ, నగరపాలన సంస్థ సయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పాపాలాల్, నగరపాలకసంస్థ కమిషనరు జె శ్రీనివాసరావు, పర్యాటకశాఖాధికారి సుమన్‌చక్రవర్తి, మాజి మార్కెట్ ఛైర్మన్ ఆర్‌జేసీ కృష్ణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కర్నాటి క్రిష్ణ, చావా నారాయణరావు, నగరపాలక అధికారులు లక్ష్మి, ఈఈ మున్సిపల్ రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

330
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles