ఏకగ్రీవ పంచాయతీ మేడేపల్లి అందరికీ ఆదర్శం..

Mon,January 14, 2019 01:33 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ముదిగొండ మండలంలోని మేడేపల్లి అన్నివిధాలుగా ఆదర్శనీయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 25న తొలివిడతలో ముదిగొండ మండలంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని, మేడేపల్లి గ్రామాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా నూతన పాలకవర్గాన్ని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత నూతన సర్పంచ్ సామినేని రమేష్, ఉపసర్పంచ్ బయ్యం రమేష్ శాలువాతో సన్మానించారు. తరువాత వార్డు సభ్యులకు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. అనంతరం ఏకగ్రీవ పాలకవర్గాన్ని ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాలుగా ఆదర్శగ్రామంగా ముందుకు సాగుతున్న మేడేపల్లి పంచాయతీ ఎన్నికలు ఇతర గ్రామాలకు ఆదర్శవంతంగా మారిందన్నారు. ముఖ్యంగా గ్రామస్తులంతా ఏకతాటిపై నడుస్తూ పంచాయతీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. మేడేపల్లిని ఆదర్శంగా తీసుకుని వీలైనని గ్రామాలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయడైరీ చైర్మన్ సామినేని హరిప్రసాద్, మేడేపల్లి సొసైటీ అధ్యక్షుడు సామినేని వెంకట్రావులను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ నాయకులు జూలకంటి సంగారెడ్డి, సామినేని రాము, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

431
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles