గ్రామస్వరాజ్యం సీఎం కేసీఆర్ సాధ్యం

Mon,January 14, 2019 01:33 AM

మధిరరూరల్, జనవరి13 : గ్రామ స్వరాజ్యం కేసీఆర్ సాధ్యమవుతుందని టీఆర్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి అన్నారు. మధిరలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో అన్ని పంచాయతీల టీఆర్ నాయకులు కలిసికట్టుగా పనిచేసి పంచాయతీలను కైవశం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ సాధ్యమవుతుందని, దీనిని గమనించిన ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికస్థానాలు టీఆర్ అభ్యర్థులను గెలిపించారన్నారు. మారుమూల గ్రామాలు, తండాలను గుర్తించి నూతన పంచాయతీలుగా ప్రకటించడం అభినందనీయమన్నారు. గతంలో ఎటువంటి రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు, తండాలకు రహదారులు ఏర్పాటుతో పాటు, అంతర్గత రోడ్లను సీసీరోడ్లుగా ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధి చేశారన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పారితోషకం అందించడం జరుగుతుందని, ఆ దిశగా ప్రజలు, నాయకులు ఆలోచించాలని అన్నారు. ఇప్పటికే జిల్లాలో కొన్ని గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టీఆర్ ఉద్యమ, సీనియర్ నాయకులు గడ్డం భద్రయ్య, మార్కెట్ కమిటీ వైస్ శీలం వీరవెంకటరెడ్డి, బొబ్బిళ్లపాటి బాబురావు, కోట కళ్యాణ్, గుగులోతు కృష్ణానాయక్, తాటి సురేష్, మీనుగు చైతన్య, గొల్లమందల చైతన్య, మోహన్, సతీష్, వినోద్, సర్ధార్, దినకర్ తదితరులు పాల్గొన్నారు.

345
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles