ఈ- నామ్ మరింత పారదర్శకత

Sat,January 12, 2019 01:57 AM

- అమలుకు వ్యాపారులు సహకరించాలి
- వరంగల్ రీజనల్ మార్కెటింగ్ జేడీ
ఖమ్మం వ్యవసాయం, జనవరి 11: జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం (ఈ-నామ్ మార్కెట్ లలో మరింత పారదర్శకత వస్తుందని వరంగల్ రీజనల్ మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ ఎల్లయ్య తెలిపారు. స్థానిక మార్కెట్ కమిటి కార్యాలయంలో వర్తక సంఘం ప్రతినిధులు, మిర్చి వ్యాపారులతో శుక్రవారం సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ- నామ్ విధానం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. దేశంలోనే ఈ పద్ధతిలో క్రయవిక్రయాలు జరపడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. అందులో భాగంగానే రెండేళ్ల నుంచి ఖమ్మం మార్కెట్ పత్తి, అపరాల క్రయవిక్రయాలలో ఈ విధానం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల నుంచి, వ్యాపారుల నుంచి మంచి సహకారం అందుతుందని సహకరిస్తూన్న ప్రతీ ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మిర్చి పంట ఎక్కువగా వచ్చే మార్కెట్ ఖమ్మం, వరంగల్ మార్కెట్ ప్రధానమైనవని, వీటిలో మిర్చి క్రయవిక్రయాలలో ఈ-నామ్ విధానం అమలుకు మార్కెటింగ్ నిర్ణయం తీసుకుందన్నారు. మిర్చిలో ఈ విధానం అమలు జరిగితే పూర్తిస్థాయిలో ఈ- నామ్ విధానం అమలు జరిగినట్లు అవుతుందన్నారు. మిర్చి వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలిగిన పరిష్కరించేందుకు మార్కెటింగ్ సిద్ధంగా ఉందన్నారు. రైతు సంఘాల నాయకులతో మరోమారు సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సైతం పరిగణంలోకి తీసుకుంటామన్నారు. అయితే తమ సమస్యలను పరిష్కరించిన తరువాతనే ఈ-నామ్ విధానాన్ని అమలు చేయాలని వ్యాపారులు సూచించారు. మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి తీసుకురావాలని వ్యాపారులు కోరారు. ఈ సమావేశంలో డీఎంఓ సంతోష్ వర్తక సంఘం అధ్యక్షుడు కొప్పు నరేష్ మిర్చిశాఖ బాధ్యులు మెంతుల శ్రీశైలం, వీరబాబు, సంఘం గౌరవ అధ్యక్షుడు నున్నా కోదండరామయ్య, దిగుమతిశాఖ కార్యదర్శి మాటేటి రామారావుతో పాటు పలువురు మిర్చి ఖరీదుదారులు, ఖమ్మం మార్కెట్ కమిటి అధికారులు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఖమ్మం మిర్చి మార్కెట్ జరుగుతున్న క్రయవిక్రయాలను పరిశీలించారు. మార్కెట్ రైతులకు అందుతున్న మద్దతు ధర, ఎదురవుతున్న ఇతర ఇబ్బందులను ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు.

415
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles