రెండు సర్పంచ్ పదవులకు నామినేషన్లు నిల్

Sat,January 12, 2019 01:56 AM

- ఉల్వనూరుబంజరలో ఆరు వార్డులకూ అదే తీరు
-మనుబోతులగూడెంలో అవగాహన లోపం వల్ల...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పంచాయతీ ఎన్నికల తొలివిడతలో భాగంగా సర్పంచ్ పదవులకు, వార్డు మెంబర్ల పదవులకు నామినేషన్లు పరిశీలన తరువాత కొన్ని వార్డులకు, సర్పంచ్ నామినేషన్లు దాఖలు కాలేదని స్పష్టమైంది. కొత్తగూడెం నియోజకవర్గ పరిధి పాల్వంచ మండలంలో తొలి విడత ఎన్నికల్లో భాగంగా సంగెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి, నారాయణరావుపేట ఎస్సీకాలనీ సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల పరిశీలన తరువాత శుక్రవారం ఈ విషయం ధృవపడింది. కేవలం ఈ రెండు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేసేందుకుఎస్టీలు ఎవరూ లేకపోవడంతోఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఇదే రీతిలో పాల్వంచ మండలం ఉల్వనూరు బంజర గ్రామ పంచాయతీలో సైతం సర్పంచ్ పదవికి ఒకేఒక నామినేషన్ దాఖలు కాగా, ఆరు వార్డు పదవులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో సర్పంచ్ పదవికి ఒకేఒక నామినేషన్ దాఖలైనప్పటికీ అదే పంచాయతీలోనాలుగు వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన తరువాత వార్డులకు ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు భావించారు. అవగాహన లోపం, తప్పుడు సలహా వల్ల నామినేషన్లు వేయకుండానే ఏకగ్రీవం చేసుకోవచ్చని చెప్పడం వల్ల ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. తరువాత విషయం తెలుసుకొని గ్రామస్తులు పొరపాటును గ్రహించారు.

343
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles