అభివృద్ధి కార్యక్రమాలను చూసే గులాబీ గూటికి..

Fri,January 11, 2019 12:54 AM

ఖమ్మం వైరారోడ్: తెలంగాణ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసే పలు పార్టీలనుంచి తండోపతండాలుగా గులాబీ గూటికి చేరుతున్నారని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొణిజర్ల, జూలురుపాడు మండలాలకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులతో పాటు 110 కుటుంబాలు గురువారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ కార్యాలయంలో ఎంపీ పొంగులేటీ శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ వారిని పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేదని, రాబోయే స్థానిక ఎన్నికల్లో అత్యధిక గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు.

ముఖ్యంగా వైరా నియోజకవర్గంలో పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని, రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ సత్తా చాటడం ఖాయమన్నారు. కొణిజర్ల మండలం గల అమ్మపాలెం గ్రామానికి చెందిన సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 70 కుటుంబాలు, టీఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ పోట్ల శ్రీనివాసరావు, అమ్మపాలెం గ్రామ టీఆర్‌ఎస్ నాయకుడు కిలారు మాధవరావుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి ఎంపీ, ఎమ్మేల్యేలు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్మానించారు. పార్టీలో చేరిన వారిలో మూడ్ సురేష్, శంకర్, కృష్ణ, బానోత్ వెంకన్న, బిక్షం, గుగులోత్ సురేష్, అర్జున్, నాగేశ్వరరావు తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు బొర్రా రాజశేఖర్, గుమ్మా రోశయ్య, సూతకాని జైపాల్, రాయల పుల్లయ్య, కోసూరి శ్రీను, కోనకంచి మోషా, యనగంటి కృష్ణ, గోసు మధు, చింతనిపు నర్సింహారావు, ముక్తి వెంకటేశ్వర్లు, ఉమ్మినేని క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

జూలూరుపాడు నుంచి 40 కుటుంబాలు..
వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలంలో గల గుండ్లరేవు గ్రామం నుంచి సుమారు 40 కుటుంబాలు వివిధ పార్టీలను వీడి ఎంపీ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరాయి. గుండ్లరేవు గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు బాలూనాయక్,కాలం బాబుల ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో వెంకటేష్, రమేష్, ప్రసాద్, నవీన్, పవన్, శివ, మహేష్, వినోద్, రంగయ్య, కృష్ణయ్య, నరేష్, వెంకటేష్, గోపాల్, నవీన్, కిరణ్, రమేష్‌తో పాటు మరో 30 కుటుంబాలున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీనాధరాజు, నాగరాజు, చలమల నర్సింహారావు, బానోత్ జగన్, కలిగి వెంకటేష్, తాళ్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మధిర మండలం నుంచి 72 కుటుంబాలు..
మధిర, నమస్తేతెలంగాణ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 72 కుటుంబాలు సీపీఎం నుంచి ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మాజీ సర్పంచ్ చింతల కృష్ణ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి టీఆర్‌ఎస్ అండదండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమల్‌రాజు, మండల కార్యదర్శి చిత్తారు నాగేశ్వరరావు, మధిర పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, యన్నం కోటేశ్వరరావు శీలం వెంకటరెడ్డి, కొఠారి రాఘవరావు, వీరబాబు, నీలపాలు నాగేశ్వరరావు, మల్లికార్జునరావు, దేవిశెట్టి రంగయ్య, సంపసాల కృష్ణ, లక్ష్మయ్య, ఉద్దండయ్య తదితరులు పాల్గొన్నారు.

382
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles