గిరిజన యువతకు జాబ్‌మేళా..

Fri,January 11, 2019 12:54 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ భద్రాచలం (ఐటీడీఏ) ఆధ్వర్యంలో నిరుద్యోగ గిరిజన యువతకు యువజన శిక్షణ కేంద్రాలు, అపోలో మెడ్ స్కిల్స్, సిక్రో సర్వ్, 02స్పా కేంద్రాల ద్వారా వివిధ కోర్సులకు శిక్షణ, ఉపాధి కోసం ఐటీడీఏ జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వి.హరికృష్ణ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించినట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో పమేలా సత్పతి తెలిపారు. గురువారం స్థానిక ఐటీడీఏ భవిత కార్యాలయంలో జరిగిన ఈ జాబ్‌మేళా కార్యక్రమానికి పీవో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ గిరిజన యువతకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు, వాటి గురించి అవగాహన కల్పించారు. జాబ్‌మేళాకు హాజరు కాని యువత భవిత కార్యాలయంలో ఈ శిక్షణలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చునని వివరించారు. శిక్షణ తరువాత అర్హతను బట్టి ట్రైకార్ రుణాలకు దరఖాస్తులు చేసుకోవచ్చునని, జాబ్‌మేళాకు మొత్తం 106 మంది యువత హాజరైనట్లు వెల్లడించారు. అ ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ నాగోరావు, జేడీఎం హరికృష్ణ, కంపెనీ ప్రతినిధులు జగన్, నాగేంద్రరెడ్డి, జేఈఆర్ పీ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

294
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles