మాటల గారడీలకు మోసపోకండి..


Wed,November 21, 2018 01:30 AM

కామేపల్లి,నవంబర్ 20: ప్రతిపక్ష పార్టీల నాయకులు,అభ్యర్థులు చెప్పే మాటల గారడీలకు మోసపోకండి.. మన అభివృద్ధి కోసం, భావితరాల బాగు కోసం టీఆర్‌ఎస్ పార్టీకి మద్ధతుగా నిలిచి తనను గెలిపించాలని ఇల్లెందు నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరం కనకయ్య అన్నారు. మద్దులపల్లి, లాల్యతండా, కెప్టెన్‌బంజర గ్రామాల్లో కోరం కనకయ్య మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లెందు నియోజకవర్గాన్నికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మళ్లీ తనను గెలిపిస్తే అభివృద్ధిలో ఇల్లెందు నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేస్తానన్నారు. దశబ్దాల తరబడి కాంగ్రెస్, టీడీపీల పాలనను చూశాం. ఈ నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనను చూశాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత హామీలను నమ్మవద్దని, ప్రజలు సంక్షేమానికి అన్నివేళలా కృషి చేసే టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని కోరారు.

టీఆర్‌ఎస్ మరో 20 ఏండ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు కేవలం ఎన్నికలప్పుడు వచ్చి వెళ్తారని, ఎన్నికల అనంతరం కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, పంట పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత కరెంట్, రైతుబీమా వంటి పథకాలు దేశంలోనే వినూత్నమైన పథకాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ప్రజల ఆకాంక్ష మేరకు పనులు చేసిన వ్యక్తినని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్, ఎంపీటీసీ ధనియాకుల హనుమంతరావు, తీర్థాల చిదంబరం, కొండాయిగూడెం సొసైటీ అధ్యక్షుడు దండగల భద్రయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాయల ఉపేందర్, మండల నాయకులు గట్టికొప్పుల వీరారెడ్డి, బోడేపూడి వీరప్రతాప్, వడియాల క్రిష్ణారెడ్డి, మూడ్ క్రిష్ణప్రసాద్‌నాయక్, అజ్మీర రాకేష్‌సోనా, ఆరెం రవి,కాట్రాల మల్లయ్య తదితరులున్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...