పాలేరు ప్రజలు చైతన్యవంతులు

Wed,November 21, 2018 01:30 AM

-ఓటు మీ ఆయుధం.. దానితోనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి..
- ప్రచారానికి వస్తున్న కూటమి అభ్యర్థిని నిలదీయండి..
- గిరిజన తండాలను పంచాయతీలుగాగుర్తించింది సీఎం కేసీఆరే..
- సొంత జాగా ఉన్న వారికి డబుల్ ఇండ్ల్లు కట్టిస్తాం..
- భక్తరామదాసుతోఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాం
- ప్రచారంలో పాలేరు అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం రూరల్, నవంబర్ 20 : అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు దొంగపార్టీలు అన్ని కలిపి కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వస్తున్నారని వారికి మీఆయుధం ఓటుతో గుణపాఠం చెప్పాలని పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కూసుమంచి మండలంలోని చౌటపల్లి, బోడియాతండా, పూరియాతండా, నర్సింహులగూడెం, కొత్తూరు, ఎర్రగడ్డతండా, దుబ్బతండా, నాన్‌తండా, బోజ్యాతండా, పాలేరు గ్రామాల్లో మంత్రి తుమ్మల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో ప్రజలు ప్రశ్నీంచాలన్నారు. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బీడు వారిన పాలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు భక్తరామాదాసు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో నిర్మించానన్నారు. రెండున్నర సంవత్సరాల కాలంలో పాలేరులో ప్రతి గ్రామంలో సమస్యలను పరిష్కరించడంతో పాటు దీర్ఘకాలికంగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేశానన్నారు. గత 70ఏళ్లలో చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ కేవలం 4సంవత్సరాల కాలంలో చేసి చూపించారన్నారు. గత పాలకులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని నాయకులు ఇప్పుడు వచ్చి చేప్పే మాటలు నమ్మొదన్నారు.

రైతులకు రైతుబంధు రూ.10వేలు, ఆసరా పింఛన్ రూ. 2016లు అందాలంటే మరోసారి కేసీఆర్ సీఎం అయితేనే సాధ్యమవుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రపాలనలో ఉన్నప్పుడు కరెంట్ కోసం ధర్నాలు, రాస్తారకోలు చేసి, ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయని, సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు ఉచితంగా 24గంటలు సాగుకు కరెంట్ సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని, ఎవరు అధైర్య పడాల్సిన అవసరంలేదని మంత్రి తుమ్మల హమీ ఇచ్చారు. ఇంతటి అపూర్వస్వాగతం పలికిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతన్నానని, వారి రుణం తీర్చుకుంటానని తెలిపారు. మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అఖండ మోజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రెండు సంవత్సరాలకు ముందు నేను ఎంటో మీకు పూర్తిగా తెలియకముందే పాలేరులో అఖండ మోజార్టీతో గెలిపించారు. మీనమ్మకాన్ని వమ్ముచేయకుండా పాలేరును రాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ సహకారంతో నెంబర్‌వన్ స్థానంలో ఉండేలా కృషి చేశానన్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి నేటి వరకు రెండు సంవత్సరాల కాలంలో పాలేరులో సుమారు 80 గిరిజన తండాలు రహదారులు లేక అల్లాడుతుంటే బీటీ రోడ్లు కోట్ల వ్యయంతో నిర్మాణం చేశామన్నారు. అభివృద్ధే మంత్రంగా పనిచేశానని అది కూడా రాజకీయాలకతీతంగా చేశానని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు దగ్గర కావాలన్నదే నాఅభిమతం అన్నారు. చిరకాలం గుర్తుండుపోయే విధంగా పనులు చేశానని అందుకు సీఎం కేసీఆర్ సహకారం మరవలేనిది అన్నారు.

మంత్రి తుమ్మలకు బ్రహ్మరథం..
మండలంలోని చౌటపల్లి, బోడియాతండా, పూరియాతండా, నర్సింహులగూడెం, కొత్తూరు, ఎర్రగడ్డతండా, దుబ్బతండా, నాన్‌తండా, బోజ్యాతండా, పాలేరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించడానికి వచ్చిన పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మహిళలు, యువకులు, నాయకులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున మంగళహరతులతో స్వాగతం పలికారు. గిరిజనులు వారి సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక స్వాగతం పలికారు.
దీంతో మంత్రి తుమ్మల ఉత్సహంతో ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో జడీప చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, మండల ఇన్‌చార్జ్ బిక్కసాని నాగేశ్వరరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్‌రెడ్డి, ఆసీఫ్‌పాష, రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం కార్యదర్శి ఇంటూరి శేఖర్, రైతు సమితి కన్వీనర్ జొన్నలగడ్డ రవికుమార్, ఎంపీపీ ఆర్ వెంకటరెడ్డి, సీడీసీ చైర్మన్ గోపాల్‌రావు, జడ్పీటీసీ వడ్తియా రాంచంద్రునాయక్, వీరెల్లీ నాగేశ్వరావు, రామసహయం బాలక్రిష్ణారెడ్డి, మలీడు వెంకన్న, బజ్జూరి రాంరెడ్డి, మాజీ సర్పంచ్‌లు బాణోత్ శ్రీను, బుజ్జి, రామసహాయం యాదవరెడ్డి, కందాల రవి, ఎంపీటీసీలు నందిపాటి సైదమ్మ, గోపె వెంకన్న, రామ్‌కుమార్, స్థానిక గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు ఉన్నారు.
పాలేరులో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరికలు..
పాలేరు నియోజకర్గలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో భాగంగా పాలేరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు వందల కుటుంబాలు టీఆర్‌ఎస్ పార్లీలో చేరారు. పార్టీలో చేరే వారిని మంత్రి తుమ్మల కండువా కప్పి సాధరంగా ఆహ్వానంచారు. పార్టీలో చేరిన వారిలో సామిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అయన అనుచరులు ఉన్నారు.

234
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles