ముగిసిన ఇంటింటికీ న్యాయసేవలు ప్రచారం

Mon,November 19, 2018 01:51 AM

ఖమ్మం లీగల్, నవంబర్ 18 : న్యాయసేవా దినోత్సవాల్లో భాగంగా పదిరోజులపాటు నిర్వహించిన ఇంటింటికీ న్యాయసేవలు కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం లక్ష్మణ్ ఆదేశాల మేరకు జిల్లాలో మొత్తం ఎనిమిది బృందాలు పదిరోజులపాటు గ్రామాల్లో పర్యటించి న్యాయసేవల లభ్యత, ఉచిత న్యాయసహాయం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. న్యాయసహాయం-వివిధ చట్టాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, చింతకాని, కొణిజర్ల, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లోని గ్రామాల్లో పారాలీగల్ వాలంటీర్లు, న్యాయవాద బృందాలు పర్యటించి న్యాయసహాయ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఇమ్మడి లక్ష్మీనారాయణ, ముక్తేశ్వరరావు, శాంతయ్య, దండా శ్రీనివాసరావు, నారాయణ, పారాలీగల్ వాలంటీర్లు నాగమణి, సుశీల, వెంకటరమణ, ఖాసింసాహెబ్, కోమలత, గురునాగలక్ష్మి, అనురాధ, సతీష్ ఖండేల్‌వాల్ తదితరులు పాల్గొన్నారు.

175
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles