సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు..

Mon,November 19, 2018 01:50 AM

-ఎంపీ పొంగులేటి
మధిర, నమస్తేతెలంగాణ: తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మధిర మండల పరిధిలోని ఆత్కూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీలో తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. జిల్లాలో తన అనుచరులకు నాలుగు సీట్లు ఇప్పించుకున్నారని తెలిపారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజును గెలిపించుకునేందుకు ముఖ్యమంత్రి తనపై బాధ్యతలు పెట్టారని, జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేసే వారిపై తన అనుచరులైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి లింగాల కమల్‌రాజు, టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మెర రామ్మూర్తి, మండల అధ్యక్షుడు దొండపాటి వెంకటేశ్వరరావు

183
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles