దగా చేసిన పార్టీలను దండించండి..


Mon,November 19, 2018 01:50 AM

తిరుమలాయపాలెం: ఏళ్ల తరబడి పరిపాలన చేసి ప్రజలను దగా చేసిన పార్టీలను దండించాలని.., నాలుగేళ్లుగా ప్రజా సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా కృషిచేసిన టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పాలేరు అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు, తిప్పారెడ్డిగూడెం, అజ్మీరతండ, రాకాశితండ, హైదర్‌సాయిపేట, పడమటితండ, జల్లేపల్లి, జోగులపాడులో ఆదివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి ప్రసంగించారు. తిరుమలాయపాలెం మండలానికి పక్కనే పాలేరు, ఆకేరు ఉన్నా సాగు, తాగు నీరులేక ప్రజలు అలమటిస్తుంటే గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజల కళ్లల్లో కన్నీరు తెచ్చిన పార్టీలకు ఓట్లు వేస్తారా? సాగు నీరు తెచ్చి రైతులు కళ్లలో సంతోషం నింపిన మాకు ఓట్లు వేస్తారా? ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇవ్వగానే భక్తరామదాసు ఎత్తిపోతల పథకం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

అందుకు ముఖ్యమంత్రి వెంటనే నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పచ్చని పైర్లు రైతుల కళ్లలో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషం కల్గుతుందని చెప్పారు. కరువు ప్రాంతాలకు సాగునీరు కల్పించేందుకు చేపట్టిన ప్రాజెక్టులను సైతం కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకునే ప్రయత్నాలు చేశాయని వివరించారు. ఉప ఉన్నికలో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అజ్మీరతండ, రాకాసితండ, హైదర్‌సాయిపేట, రావిచెట్టుతండ వద్ద ఆకేరుపై బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పనులు చురుకుగా జరుగుతున్నట్లు వివరించారు. సాగు నీటి కల్పనలో పాలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నిలపడమే తమ ధ్యేయమన్నారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మళ్లీ ఆదరించి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామాల్లో మహిళలు, ప్రజలు తుమ్మలకు ఘనస్వాగతం పలికారు. తిలకం దిద్ది డప్పువాయిద్యాలతో ఆహ్వానించారు. పాతర్లపాడులో గీతకార్మికులు తుమ్మలకు గొర్రె ముత్తాదిని బహూకరించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీచైర్‌పర్సన్ కవిత, టీఆర్‌ఎస్ నాయకులు ఆర్.నరేష్‌రెడ్డి, ఎంపీపీ కొప్పుల అశోక్, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బోడ మంగీలాల్, కొండబాల వెంకటేశ్వర్లు, ఆలదాసు ఆంజనేయులు, తమిర వెంకటరెడ్డి, జడల నగేష్, రామసహాయం వెంకటరెడ్డి, ఆలదాసు రంగయ్య, బాషబోయిన వీరన్న, పోట్ల సూర్యచంద్రం, బానోత్ చీమ్లానాయక్, మట్ట కృష్ణ, మద్దిని శ్రీను, మట్ట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...