మహాతొపులాట

Sun,November 18, 2018 02:02 AM

-రోడ్డెక్కిన సీపీఐ రాజకీయం..
-సీపీఐ నాయకులు, రెబల్ అభ్యర్థి వర్గీయుల మధ్య తోపులాట
-వైరాలో ఉద్రిక్త పరిస్థితులు..
వైరా, నమస్తే తెలంగాణ : మహాకూటమి పొత్తుల్లో భాగంగా వైరా సీటును దక్కించుకుంది సీపీఐ పార్టీ. కాని నాయకులకు ఒకరికొకరిని పొసగడం లేదు. నడిరోడ్డుపై బాహాబాహికి దిగి కొట్టుకున్నంత పని చేశారు. వైరాలోని ఏసీపీ కార్యాలయం సాక్షిగా రాష్ట్రీయ ప్రధాన రహదారిపై శనివారం సీపీఐ నాయకులు బాహాబాహికి దిగారు. సీపీఐ మహాకూటమిలో సీటును పొందిన సీపీఐ అభ్యర్థిగా బానోత్ విజయబాయ్‌నిస్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా నాయకత్వం శనివారం నామినేషన్ దాఖలు చేయించింది. అనంతరం సీపీఐ రెబల్ అభ్యర్థి బానోత్ లాల్‌సింగ్ కూడా నామినేషన్ వేసేందుకు వస్తుండగా సీపీఐ నాయకులు, రెబల్ అభ్యర్థి లాల్‌సింగ్ వర్గీయుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండు సంవత్సరాలుగా వైరా సీటును ఆశించి బానోత్ లాల్‌సింగ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అంతేకాకుండా సీపీఐ సంబంధించిన పలు సమావేశాలు నిర్వహించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసి నియోజకవర్గంలో పర్యటించిన లాల్‌సింగ్‌కు అధినాయకత్వం సీటు కేటాయించేందుకు నిరాకరించింది. నియోజకవర్గంలో ఎప్పుడూ పర్యటించని, ప్రజలకు పరిచయం లేని విజయబాయ్‌కి సీపీఐ టిక్కెట్ ఇచ్చింది. దీంతో నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన తాను సీపీఐ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని బానోత్ లాల్‌సింగ్ ఇటీవల ప్రకటించారు.

శనివారం లాల్‌సింగ్ వైరాలో వందలాది మంది ప్రజలతో నామినేషన్ వేసేందుకు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు తహసీల్దార్ కార్యాలయం సమీపానికి చేరుకునే సమయానికి అప్పటికే విజయబాయ్ నామినేషన్ వేయించి తిరిగి వస్తున్న సీపీఐ జిల్లా నాయకులతో పాటు మరికొంత మంది నాయకులకు ఆ ర్యాలీ ఎదురైంది. ఆర్యాలీలో బానోత్ లాల్‌సింగ్ సీపీఐ కండువ కప్పుకొని రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వస్తుండటంతో సీపీఐ జిల్లా నాయకులకు, మండల నాయకులకు తీవ్ర కోపాన్ని తెప్పించింది. వెంటనే సీపీఐ నాయకులు లాల్‌సింగ్ ర్యాలీకి ఎదురుగా వెళ్లి లాల్‌సింగ్ మెడలో ఉన్న సీపీఐ కండువను లాక్కున్నారు. దీంతో లాల్‌సింగ్ వర్గీయులకు, అక్కడున్న ఐదుగురు సీపీఐ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఏసీపీ కార్యాలయం సాక్షిగా సీపీఐ నాయకులు బాహాబాహికి దిగి తోపులాటకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో సీపీఐ పార్టీ నడిరోడ్డున పడినైట్లెంది. అనంతరం లాల్‌సింగ్ తహసీల్దార్ కార్యాలయానికి లాల్‌సింగ్ పరుగెత్తుకుంటూ వెళ్లి నామినేషన్ వేశారు. మహాకూటమిలో సీటు సంపాదించిన సీపీఐకి ఆపార్టీలోని రెబల్ అభ్యర్థి రంగంలో ఉండటంతో పాటు కాంగ్రెస్ నాయకులు మొండి చేయి చూపడంతో సీపీఐ అభ్యర్థిలో ఆపార్టీలో తీవ్ర కలవరం ఏర్పడుతుంది. ఈ తోపులాట జరిగే సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వివాదం సర్ధుమనిగింది.

178
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles