సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష


Sun,November 18, 2018 02:01 AM

-ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
-ఎంపీ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి 35కుటుంబాలు చేరిక
ఖమ్మం వైరారోడ్, నవంబర్17: ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ముదిగొండ మండలంలోని బాణాపురం తండాకు చెందిన 35 కుటుంబాలు ఎంపీ పొంగులేటి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో వివక్షకు గురైన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కేవలం నాలుగున్న ఏండ్లలోనే బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఆహర్నిశలు కృషి చేశారన్నారు. ముఖ్యంగా ఆయకట్టు చివరి భూములకు సైతం సాగునీటిని అందించిన కేసీఆర్ సర్కారు రాష్ర్టాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దేందుకు అనేక ప్రాజెక్ట్‌లు చేపట్టిందన్నారు. అంతేకాకుండా రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచేలా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందించిందన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మరోసారి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కర్షితులై వందలాది మంది టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరటంతో టీఆర్‌ఎస్ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ భారీ మెజార్టీతో విజయం సాధించటం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. కమల్‌రాజ్ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ నాయకలు బోయినపల్లి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో తేజావత్ సునీల్, భూక్యాసైదా, నాగేశ్వరరావు, భద్యానాయక్, బానోత్ నాగేశ్వరరావు, కోటేశ్వరరావులతో పాటు మరో 30 కుటుంబాలవారున్నారు. ఈ కార్యక్రమంలో విజయడెరి చైర్మన్ సామినేని హరిప్రసాద్‌తో పాటు మండల నాయకులు తదితరులున్నారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...