19న ఖమ్మంలో కేసీఆర్ పర్యటన..!


Fri,November 16, 2018 12:24 AM

ఖమ్మం ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటన ఖరారైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గులాబీ దళపతి 19న ఖమ్మానికి రానున్నారు. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్ చేత 19న మధ్యాహ్నం 1.30గంటలకు శుభ ముహూర్తాన నామినేషన్ దాఖలు చేయిస్తారు. అనంతరం 2.00గంటలకు ఖమ్మం నగరం డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగసభకు హాజరై ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నాయకులు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో ఆ పార్టీ నాయకుల్లో జోష్ నింపినైట్లెంది. పర్యటన పనుల్లో మంత్రి తుమ్మల నిమగ్నమయ్యారు. కేసీఆర్ పర్యటనకు అవసరమైన కార్యాచరణపై రేపుట్నుంచి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని టీఆర్‌ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను కలుపుకొని ఏర్పాట్లలో నిమగ్నం కానున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లతో పాటు అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఒకరిద్దరు మంత్రులు, పలువురు పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు సైతం హాజరుకానున్నారు.

239
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...