రైతు ప్రయోజనాల కోసమే రైతుబంధు పథకం...


Thu,September 13, 2018 12:53 AM

-రూరల్‌లో ఇద్దరికి బీమా పత్రాల అందజేత
ఖమ్మంరూరల్, సెప్టెంబర్ 12 : రైతుల ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం దేశానికే ఆదర్శనీయమని రాష్ట్ర పార్టీ కార్యదర్శి తాతా మధు అన్నారు. రూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామానికి చెందిన పాశం వెంకటేశ్వర్లు, గుండాలతండాకు చెందిన ధరావత్ కాల్యలు అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు. ఈ ఇరువురికి ప్రభుత్వం ప్రకటించిన రైతుబీమా పథకం కింద ఒక్కొక్కరికి రూ. 5లక్షలు వారి నామినీల ఖాతాలో జమ అయ్యాయి. బుధవారం రూరల్ మండలం నాయుడుపేటలో గల సొసైటీ కార్యాలయంలో బీమా వర్తింపజేసేందుకు గాను బాధిత కుటుంబసభ్యులకు బీమా పత్రాలను స్థానిక ఏఈవో, టీఆర్‌ఎస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుపెట్టుబడి పథకం, ఉచిత బీమా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో ప్రతి రైతుకు పైసా ఖర్చులేకుండా పాస్ పుస్తకాలు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో రైతాంగం అందరూ సమష్టిగా సీఎం కేసీఆర్ పార్టీని బలపరిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకుడు సాధు రమేష్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ యండ్లపల్లి రవి, మాజీ సర్పంచిలు గూడిబోయిన దర్గయ్య, ఎల్లయ్య, నాయకులు కొప్పుల ఆంజనేయులు, జర్పుల లక్ష్మణ్, అక్కినపల్లి వెంకన్న, మట్టా వెంకటేశ్వర్లు, రవి, బండి క్రిష్ణమూర్తి తదితరులు ఉన్నారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...