వచ్చే ఏడాది హరితహారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి


Wed,September 12, 2018 01:42 AM

ఖమ్మంసిటీ, సెప్టెంబర్ 11 : వచ్చే సంవత్సరానికి గాను పెద్దఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్‌వీ. కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం టీటీడీసీ సమావేశ మందిరంలో అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల ద్వారా చేపడుతున్న పథకాల అమలు తీరును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరానికి గాను జిల్లాలో 3కోట్ల 15లక్షల మొక్కలు నాటేందుకు అవసరమైన ప్రణాళికను తయారుచేయాలని ఆయన తెలిపారు. ఇందుకు గాను శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించారు. అటవీ శాఖ 85 లక్షలు, గ్రామీణాభివృద్ధి శాఖ 80 లక్షలు, ఐటీసీ భద్రాచలం 75 లక్షలు, మున్సిపాలిటీలు 65 లక్షలు, సింగరేణి 20 లక్షలు, వ్యవసాయ శాఖ 20 లక్షలు, ఎక్సైజ్ శాఖ 2 లక్షలు, మొక్కలు నాటే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు.

ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 3 కోట్ల 95 లక్షల మొక్కలను నర్సరీల ద్వారా పెంచాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు ఇప్పటి వరకు జిల్లాలో నర్సరీల ఏర్పాటుకు 494 గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు అనుబంధ శాఖ అధికారులు కలిసి సమన్వయంతో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడం ద్వారా రైతుకు వ్యవసాయానికి సంబంధించిన పథకాల అమలు తీరుపై అవగాహన పెంపొందించ వచ్చని తెలిపారు. వచ్చే జనవరి 26,2019 లోగా జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రణాళికను తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో పత్తి, మిరప పండిస్తున్న విస్తీర్ణాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. పశు సంవర్ధక శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కృత్రిమ గర్భధారణ ద్వారా ఒంగోలు, ముర్రా జాతి గేదెల సంతతిని పెంచాలని అన్నారు. మేలు రకమైన నాటు కోళ్ళ సంతతిపై రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో పాడి గెదెల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పశు సంవర్థకశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో కన్జర్వేటర్ ఆఫ పారెస్టు డాక్టర్ సునీల్ ఎస్. హిరామత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఝాన్సీలక్ష్మీకుమారి, డీఆర్‌డీఓ పీడీ ఇందుమతి, జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మారుపాక నగేష్, పశు సంవర్థక శాఖ అధికారి ,ఆత్మ పీడీ అగ్రికల్చర్ ఏడీలు, ఏఈలు, వెటర్నరీ వైధ్యాదికారి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...