కేసీఆర్ నియమించిన అభ్యర్థిని గెలిపించడమే పార్టీ లక్ష్యం

Wed,September 12, 2018 01:41 AM

-కాంగ్రెస్, సీపీఐ పార్టీల నుంచి 25కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరిక
బోనకల్లు, సెప్టెంబర్ 11 : కేసీఆర్ నియమించిన అభ్యర్థిని గెలిపించడమే టీఆర్‌ఎస్ పార్టీ లక్ష్యమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు అన్నారు. మంగళవారం మండలంలోని కలకోట గ్రామానికి చెందిన కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు చెందిన 25కుటుంబాలు కలకోట సహకార సంఘం అధ్యక్షులు చావా లక్ష్మణరావు, ఇటికాల శ్రీనివాసరావు, చావా హనుమంతరావు, అబ్బూరి రత్తయ్య నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కొండబాల కోటేశ్వరరావు, తాతా మధులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగినప్పుడే టీఆర్‌ఎస్ ఫలితం సాధిస్తుందని తెలిపారు.

కార్యకర్తలు ఎంతో బాధ్యతగా పనిచేయాలని, గ్రామాల్లో కొత్తగా ఓటర్లను చేర్పించి ఇతర పార్టీల నుంచి ప్రజలను టీఆర్‌ఎస్‌లో చేర్పించేందుకు కృషిచేయాలన్నారు. మధిరలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని, అభ్యర్థి కమల్‌రాజును గెలిపించి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే మధిర నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు తోటపల్లి జాషియా, వెంగళ ఆనందరావు, గద్దల లక్ష్మయ్య, యంగల సామేలు, తోటపల్లి మాణిక్యరావు, బలుగూరి ఆనందరావు, వెంగళ భిక్షం, తోటపల్లి పుల్లారావు, యోహాను, నారపోగు ముక్కంటితో పాటు, మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు చేరారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమలరాజు, టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మెర రామ్మూర్తి, మండల కార్యదర్శి పారా ప్రసాద్, మండల రైతుసమన్వయ సమితి కన్వీనర్ వేమూరి ప్రసాద్, బోనకల్లు మాజీసర్పంచ్ చావా వెంకటేశ్వరరావు, సహకార సంఘం అధ్యక్షులు గుండపనేని సుధాకర్‌రావు, యార్లగడ్డ చిన్ననరసింహా, బోయినపల్లి మురళీ, పెద్దప్రోలు నాగభూషణం, రామిశెట్టి శ్రీనివాసరావు, షేక్ నిజాం, తమ్మారపు బ్రహ్మయ్య, పాపినేని శ్రీనివాసరావు, బండి వెంకటేశ్వర్లు, చావా నరేందర్, తోటపల్లి రాజశేఖర్, కాకాని శ్రీనివాసరావు, బత్తినేని భాస్కర్‌రావు, సాదినేని రాంబాబు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

216
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles