భాషకోసం పోరాడిన మహోన్నతుడు కాళోజీ

Wed,September 12, 2018 01:36 AM

కవి, తెలంగాణ బీసీ సంఘ సభ్యులు జూలూరు గౌరిశంకర్
ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 11 : భాష కోసం యుద్ధం చేసినవాడు కాళోజీ, భాష, సాంస్కృతిక ఆస్తిత్వం నుంచి వచ్చిన ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన భూమిక వహించిందని కవి, బీసీ సంఘ సభ్యులు జూలూరు గౌరీశంకర్ అన్నారు. నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాళోజీ సాహిత్యం-భాష ప్రత్యేకత అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణకు భాషా యుద్ధం, భావజాల యుద్ధాన్ని అందించిన ఘనత కాళోజీదేనని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తే ఈ ప్రాంత ప్రజలకు తిరగబడే మనస్తత్వాన్ని, పోరాటం చేసే చైతన్యాన్ని నింపిందన్నారు. ఈనాటి యువతరం ఆదర్శంగా తీసుకుని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, సిలబస్‌తో పాటు సామాజిక చింతన, సాహిత్య అధ్యయనంలో స్ఫూర్తి వంతమైన పౌరులుగా నిలవాలని కోరారు. తొలుత కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైవీ రెడ్డి రచించిన స్ఫూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమణ, బీసీ వేల్పేర్ అధికారి ఋషికేశ్వర్‌రెడ్డి, డాక్టర్ జర్పుల రమేష్, వెంకటేశ్వర్లు, మేఘమాల, విజయలక్ష్మి, రత్నప్రసాద్, గోపి తదితరులు పాల్గోన్నారు.

172
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles