కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి..

Wed,September 12, 2018 01:35 AM

-ప్రజా ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలి
-పువ్వాడ అజయ్‌కుమార్
మామిళ్లగూడెం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. మంగవారం 24వ డివిజన్ పరిధి సహకారనగర్‌లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటుందన్నారు. ఇలాంటి ప్రజా ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు అవసరమైన కంటి పరీక్షలతో పాటు కళ్లజోళ్లు, మందులు పంపిణీ.. అవసరమైతే శస్త్ర చికిత్సలు చేయించడం హర్షణీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అన్నివర్గాల ప్రజలకు చేరువ చేయడం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఉప మేయర్ బత్తుల మురళీప్రసాద్, నాయకులు సుదర్శన్‌రావు, కృష్ణమోహన్, నాగేశ్వరరావు, పిల్లి శేఖర్, బొగ్గారపు కోటి, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నరేందర్, వైద్యులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

210
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles