వెంకటేశ్వర్లు ఇన్ఫార్మర్ కాదు


Wed,September 12, 2018 01:34 AM

కొత్తగూడెం క్రైం : మావోయిస్టులు హతమార్చిన కుర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్పా వెంకటేశ్వర్లు పోలీస్ ఇన్ఫార్మర్ కాదని పోలీసులు స్పష్టం చేశారు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని భూ పంచాయతీ విషయంలో రెండు రోజుల క్రితం మావోయిస్టులు తీసుకెళ్లి మాట వినకపోవడంతో అతనిని కొట్టి చంపినట్లు తదుపరి విచారణలో తేలిందని ఎస్పీ కార్యాలయానికి సమాచారం వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అమాయక గిరిజనులను దారుణంగా కొట్టి చంపిన తరువాత ఇన్ఫార్మర్ అని ముద్ర వేయడం మావోయిస్టులకు సర్వసాధారణమైందని తెలిపారు. అమాయకంగా నిజాయతీతో వారి ప్రాంతాల్లో జీవించే గిరిజనులను మావోయిస్టులు హతమార్చడాన్ని పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

170
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...