రెండు లారీలు ఢీ : ఇద్దరికి తీవ్రగాయాలు


Wed,September 12, 2018 01:34 AM

కూసుమంచి, నమస్తే తెలంగాణ : రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు డ్రైవర్‌లు క్యాబిన్లలో ఇరుక్కుపోయిన ఘటన మంగళవారం రాత్రి కూసుమంచిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం నుంచి ఇసుక లోడ్‌తో హైద్రాబాద్ వెళ్తున్న ఏపీ6 టీవై 9396 లారీ, హైద్రాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్న ఆర్‌జేఒ 7జీఏ 9371 నెంబర్ గల లాలు మండల కేంద్రానికి సమీపంలో వేగంగా ఢీకొని పెద్ద శబ్దం రావడంతో స్థానికులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. ఘటనా స్థలంలో ఇద్దరు డ్రైవర్లు క్యాబిన్‌లలో ఇరుక్కుపోయారు. హైద్రాబాద్ నుంచి వచ్చే లారీ డ్రైవర్‌ను వెంటనే బయటకుతీసి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఇసుక లోడ్‌తో ఉన్న లారీ డ్రైవర్‌ను బయటకు తీయడానికి సుమారు అర గంటపాటు స్థానికులు పోలీసులు కష్టపడి జేసీబీ సహాయంతో బయటకు తీశారు. ఇద్దరికీ త్రీవగాయాలు కావడంతో ఖమ్మం ఆసుప్రతికి తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు కృష్ణ, చిరంజీవి ఉన్నారు.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...