కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి కూలీ మృతి


Wed,September 12, 2018 01:34 AM

కూసుమంచి, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 11 : రోడ్డు పనులు నిర్వహిస్తున్న ఓ గుత్తేదారు నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపటంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పాలేరు గ్రామానికి చెందిన రాధాకృష్ణ అనే కాంట్రాక్టర్ జుఝల్‌రావుటపేటలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాడు. అదే గ్రామానికి చెందిన శ్రీరాముల వెంకన్న(55) రోడ్డు నిర్మాణ పనులకు వచ్చాడు. ఈ క్రమంలో వెంకన్న గోడపక్కన ఇసుక తీస్తుండగా రాధాకృష్ణ ట్రాక్టర్ వేగంగా నడుపుతూ గోడను ఢీకొట్టాడు. దీంతో గోడ కూలి వెంకన్నపై పడగా తోటి కూలీలు, స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని గోడపెళ్లలను తొలగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వెంకన్న మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై అశోక్‌రెడ్డి సందర్శించి శవ పంచనామా చేసి, నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడినిన గుత్తేదారు రాధాకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...