నీటితొట్టిలో పడి చిన్నారి మృతి


Wed,September 12, 2018 01:34 AM

మధిరరూరల్, సెప్టెంబర్ 11 : ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన మంగళవారం మండలంలోని తొర్లపాడులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. తొర్లపాడు గ్రామానికి చెందిన మట్టం గోపినాథ్, సుకన్య దంపతుల కుమార్తె లాస్య అలియాస్ శ్రావ్య (18 నెలలు) ఆడుకుంటూ ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టిలో పడింది. దీనిని గమనించిన తల్లి తొట్టిలో నుంచి సుకన్యను బయటకు తీయగా చిన్నారి అపస్మారక స్థితికి చేరుకోవడంతో 108 వాహనం ద్వారా మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నారిని పరీక్షించగా అప్పటికే మృతిచెందిందినట్లు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రోధనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

170
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...